Share News

Sensex Surges: సూచీలకు జీడీపీ జీఎ్‌సటీ జోష్‌

ABN , Publish Date - Sep 02 , 2025 | 05:20 AM

గత వారం వరుసగా మూడు రోజులు నష్టాలు చవిచూసిన భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మళ్లీ లాభాల బాటపట్టాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 554.84 పాయింట్లు ఎగిసి 80,364.49 వద్దకు చేరగా.. నిఫ్టీ 198.20 పాయింట్ల వృద్ధితో...

Sensex Surges: సూచీలకు జీడీపీ జీఎ్‌సటీ జోష్‌

సెన్సెక్స్‌ 555 పాయింట్లు జంప్‌

ముంబై: గత వారం వరుసగా మూడు రోజులు నష్టాలు చవిచూసిన భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మళ్లీ లాభాల బాటపట్టాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 554.84 పాయింట్లు ఎగిసి 80,364.49 వద్దకు చేరగా.. నిఫ్టీ 198.20 పాయింట్ల వృద్ధితో 24,625.05 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5.2 లక్షల కోట్లు పెరిగి రూ.448.85 లక్షల కోట్లకు (5.09 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. ఐటీ, ఆటో, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగ షేర్లలో వాల్యూ బైయింగ్‌ మార్కెట్‌ ర్యాలీకి దోహదపడింది. జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి రేటు 5 త్రైమాసికాల గరిష్ఠ స్థాయి 7.8 శాతానికి పుంజుకోవడంతోపాటు ఈవారంలో జరగనున్న జీఎ్‌సటీ మండలి సమావేశంలో ప్రతిపాదిత జీఎ్‌సటీ రేట్ల తగ్గింపునకు ఆమోదం లభించవచ్చని.. దీంతో ఆర్థిక వ్యవస్థలో వినియోగం మరింత పెరగనుందన్న అంచనాలు ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2025 | 05:21 AM