Share News

Indian Stock Market: సెన్సెక్స్‌ 410 పాయింట్లు అప్‌

ABN , Publish Date - Sep 04 , 2025 | 05:32 AM

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో మధ్యాహ్నం వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ, ఆఖరి గంటలో భారీగా పుంజుకున్నాయి. దాంతో సెన్సెక్స్‌ 409.83 పాయింట్ల వృద్ధితో 80,567.71 వద్ద, నిఫ్టీ 135.45 పాయింట్ల పెరుగుదలతో...

Indian Stock Market: సెన్సెక్స్‌ 410 పాయింట్లు అప్‌

తొలుత తడబాటు.. ఆఖర్లో జోరు

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో మధ్యాహ్నం వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ, ఆఖరి గంటలో భారీగా పుంజుకున్నాయి. దాంతో సెన్సెక్స్‌ 409.83 పాయింట్ల వృద్ధితో 80,567.71 వద్ద, నిఫ్టీ 135.45 పాయింట్ల పెరుగుదలతో 24,715.05 వద్ద ముగిశాయి. జీఎ్‌సటీ మండలి సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలపై ఆశాభావంతోపాటు మెటల్‌ షేర్లలో ర్యాలీ ఇందుకు దోహదపడ్డాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 21 రాణించాయి. టాటా స్టీల్‌ షేరు 5.90 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 0.90ు శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.63ు ఎగబాకాయి. రంగాలవారీ సూచీల్లో మెటల్‌ 3.08 శాతం పుంజుకోగా.. కమోడిటీస్‌, హెల్త్‌కేర్‌ ఒక శాతానికి పైగా పెరిగాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మరో రూ.1,666.46 కోట్ల నికర అమ్మకాలకు పాల్పడగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ.2,495.33 కోట్ల కొనుగోళ్లు జరిపారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఆల్‌టైం కనిష్ఠ స్థాయి నుంచి కాస్త కోలుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు పెరిగి రూ.88.06 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 04 , 2025 | 05:32 AM