Share News

Trading Opens: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ షురూ.. ఫ్లాట్‌గా సూచీలు

ABN , Publish Date - Sep 15 , 2025 | 10:05 AM

నేటి సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అయితే, ఆటోమొబైల్, వైట్ గూడ్స్, హెల్త్ కేర్, సిమెంట్, హోటల్స్ రంగాల షేర్లు లాభపడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Trading Opens: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ షురూ.. ఫ్లాట్‌గా సూచీలు
Stock Market Today

ఇంటర్నెట్ డెస్క్: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్ స్వల్ప నష్టంతో 81,899 వద్ద, నిఫ్టీ 12 పాయింట్స్ కోల్పోయి 25,101 పాయింట్ల వద్ద కదలాడుతోంది (Sensex, Nifty).

అయితే, ఈసారి ప్రామాణిక సూచీలు లాభాల్లో కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ సూచీలో హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ తదితర షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈసారి ఆటోమొబైల్, వైట్ గూడ్స్, హెల్త్ కేర్, సిమెంట్, హోటల్స్ రంగాల షేర్లు లాభపడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరోవైపు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో ఆసియా మార్కెట్‌ల సూచీలు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. మదుపర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వడ్డీ రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇక భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై మార్కెట్ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి.


ఇవి కూడా చదవండి

నేడు చివరి తేదీ..ఐటీఆర్ దాఖలు మిస్ అయితే మీకే నష్టం

గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 15 , 2025 | 10:14 AM