Share News

Stock Markets Wednesday Closing: లాస్ట్ లో బిగ్ జర్క్.. ఫ్లాట్ గా మార్కెట్ సూచీలు

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:34 PM

స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్లు అనంతరం కూడా బాగానే ముందుకు సాగాయి. అయితే, లాస్ట్ పావుగంటలో మార్కెట్ భారీగా పడిపోయింది.

Stock Markets Wednesday Closing: లాస్ట్ లో బిగ్ జర్క్.. ఫ్లాట్ గా మార్కెట్ సూచీలు
Stock Markets Wednesday Closing

Stock Markets Wednesday Closing: ఇవాళ(బుధవారం) స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్లు అనంతరం కూడా బాగానే ముందుకు సాగాయి. అయితే, లాస్ట్ పావుగంటలో మార్కెట్ భారీగా పడిపోయింది. నిఫ్టీ, సెన్సెక్స్ రెండు సూచీలు కేవలం 15 నిమిషాల్లోనే రెండు వందలకు పైగా పాయింట్లు కోల్పోవడంతో మార్కెట్లు ఫ్లాట్ గా ముగియాల్సి వచ్చింది. లేదంటే ఇండియా.. పాకిస్థాన్ యుద్ధ సన్నాహాల నడుమ కూడా భారత మార్కెట్లు ఏమాత్రం జంకకపోవడం విశేషం.

దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఆందోళనలు(ఇండియా - పాకిస్థాన్), మరో పక్క బజాజ్ ఫైనాన్స్ కార్పొరేట్ గైడెన్స్ కారణంగా బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 అస్థిర ట్రేడింగ్ సెషన్‌ను దాదాపు ఫ్లాట్‌గా ముగించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి, సెన్సెక్స్ 0.06 శాతం లేదా 46.14 పాయింట్లు పడిపోయి 80,242.24 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 0.01 శాతం లేదా 1.75 పాయింట్లు తగ్గి 24,334.20 వద్ద ముగిసింది. ఇవాళ బజాజ్ ఫైనాన్స్ షేరు ధర ఏకంగా రూ.479.50 పైసలు తగ్గింది.

పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరగడం, బజాజ్ ఫైనాన్స్ నిరాశపరిచే ఫార్వర్డ్ అవుట్‌లుక్ కారణంగా మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. గత ఆరు సెషన్లలో ఐదు సెషన్లలో భారతీయ ఈక్విటీలు ఆసియా మార్కెట్ల సూచీల కంటే వెనుకబడి ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, MSCI ఆసియా పసిఫిక్ ఇండెక్స్ బుధవారం 0.4 శాతం పెరిగింది.

ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతల మధ్య భారత్ చాలా సేఫ్ సైడ్ లో ఉందనే భావన మధ్య విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఇండియా మార్కెట్లోకి పెరగడం వల్ల ఏప్రిల్ కనిష్ట స్థాయిల నుండి 10 శాతం పుంజుకున్నప్పటికీ, కాశ్మీర్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత ఇండో-పాక్ సంబంధాలపై పెరిగిన ఆందోళనల తరువాత మార్కెట్లు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.


Read Also: Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..

India Us Trade: వాణిజ్య చర్చలు బేష్... భారత్‌తో త్వరలో ఒప్పందం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

India Pakistan: టెన్షన్‌లో పాకిస్థాన్.. మరో 36 గంటల్లో..

Updated Date - Apr 30 , 2025 | 05:44 PM