Share News

Stock Market News: మార్కెట్లో ఊరట ర్యాలీ

ABN , Publish Date - Aug 12 , 2025 | 03:17 AM

వరుసగా ఆరు వారాలుగా నష్టపోతూ మూడు నెలల కనిష్ఠానికి జారుకున్న ఈక్విటీ సూచీలకు సోమవారం కాస్త ఊరట లభించింది. ఇంధన, వాహన, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు వాల్యూ బైయింగ్‌కు పాల్పడటంతో మార్కెట్‌ మళ్లీ లాభాల్లో...

Stock Market News: మార్కెట్లో ఊరట ర్యాలీ

  1. 746 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

  2. రూ.3.50 లక్షల కోట్ల సంపద వృద్ధి

ముంబై: వరుసగా ఆరు వారాలుగా నష్టపోతూ మూడు నెలల కనిష్ఠానికి జారుకున్న ఈక్విటీ సూచీలకు సోమవారం కాస్త ఊరట లభించింది. ఇంధన, వాహన, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు వాల్యూ బైయింగ్‌కు పాల్పడటంతో మార్కెట్‌ మళ్లీ లాభాల్లో పయనించింది. సెన్సెక్స్‌ 746.29 పాయింట్ల వృద్ధితో 80,636.05 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 221.75 పాయింట్ల లాభంతో 24,585.05 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.3.5 లక్షల కోట్ల పెరుగుదలతో రూ.444.13 లక్షల కోట్లకు చేరుకుంది. అమెరికా మార్కెట్ల సానుకూల సంకేతాలు, వరుసగా అమ్మకాలకు పాల్పడుతూ వచ్చిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫఐఐ) మళ్లీ మన మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను బలపరిచిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నెల 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ముగిసేందుకు ఈ సమావేశం బాటలు వేయనుందన్న అంచనాలూ మార్కెట్‌ ర్యాలీకి దోహదపడ్డాయి.

ఇవీ చదవండి:

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్

పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం

Read Latest and Business News

Updated Date - Aug 12 , 2025 | 03:17 AM