Sensex fall 2025: 82000 దిగువకు సెన్సెక్స్
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:07 AM
ఈక్విటీ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి. సెన్సెక్స్ 82,000 పాయింట్లు, నిఫ్టీ 25,100 పాయింట్ల దిగువకు జారాయి. బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్...
రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: ఈక్విటీ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి. సెన్సెక్స్ 82,000 పాయింట్లు, నిఫ్టీ 25,100 పాయింట్ల దిగువకు జారాయి. బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో మదుపరులు లాభాలు స్వీకరించడం ఇందుకు కారణం. విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ, ఐటీ షేర్లలో కొనసాగిన అమ్మకాలు కూడా వరుస నష్టాలకు మరో కారణం. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 386.47 పాయింట్లు కోల్పోయి 81,715.63 వద్దకు జారుకుంది. నిఫ్టీ 112.60 పాయింట్ల నష్టంతో 25,056.90 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.3 లక్షల కోట్లు తగ్గి రూ.460.56 లక్షల కోట్లకు పడిపోయింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి