Indian Equity Market: ఆఖర్లో లాభాల స్వీకరణ
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:12 AM
ఈక్విటీ మదుపరులు ఆఖర్లో బ్యాంకింగ్, ఆటో రంగ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే, సెన్సెక్స్ 206.61 పాయింట్లు కోల్పోయి 80,157.88 వద్దకు...
సెన్సెక్స్ 206 పాయింట్లు డౌన్
ముంబై: ఈక్విటీ మదుపరులు ఆఖర్లో బ్యాంకింగ్, ఆటో రంగ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే, సెన్సెక్స్ 206.61 పాయింట్లు కోల్పోయి 80,157.88 వద్దకు జారుకుంది. నిఫ్టీ 45.45 పాయింట్లు తగ్గి 24,579.60 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత సంస్థల్లో 16 నష్టపోయాయి. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు మాత్రం 0.64 శాతం వరకు పెరిగాయి. రంగాల వారీ సూచీల్లో బ్యాంకెక్స్, టెలికాం, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ నేలచూపులు చూశాయి.
చక్కెర షేర్లు మరింత తీపిగా: షుగర్ మిల్లులు, డిస్టిలరీలకు ఇథనాల్ ఉత్పత్తిపై ఆంక్షలను ఎత్తివేయడంతో ఈ రంగ షేర్లు భారీగా పుంజుకున్నాయి. రాజ్‌శ్రీ షుగర్స్ షేరు ఏకంగా 20 శాతం ఎగబాకింది. శ్రీ రేణుక షుగర్స్ 12.72 శాతం, ద్వారికేశ్ షుగర్ ఇండస్ట్రీస్ 12.46 శాతం, ధామ్‌పుర్ షుగర్ మిల్స్ 10.36 శాతం, శక్తి షుగర్స్ 8.25 శాతం, అవధ్ షుగర్ అండ్ ఎనర్జీ 5.03 శాతం లాభపడ్డాయి.
కొత్త ఆల్‌టైం కనిష్ఠానికి రూపాయి: భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠానికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 5 పైసల నష్టంతో రూ.88.15 వద్ద ముగిసింది.
ఇండెక్స్ ఆప్షన్స్‌కు ఇంట్రాడే పరిమితులు
జేన్‌స్ట్రీట్ ఉదంతం నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ మండలి సెబీ.. ఇండెక్స్ ఆప్షన్స్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్ ఇంట్రాడే పొజిషన్స్‌పై పరిమితులు విధించింది. వీటిలో ట్రేడింగ్ జరిపే ప్రతి సంస్థకు నెట్ ఇంట్రాడే పొజిషన్‌ను రూ.5,000 కోట్లకు పరిమితం చేస్తున్నట్లు మంగళవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. గ్రాస్ ఇంట్రాడే పొజిషన్ పరిమితిని రూ.10,000 కోట్లకు పరిమితం చేసింది. కొత్త నియమావళి వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని సెబీ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
కిందిస్థాయి ఉద్యోగితో ఎఫైర్.. నెస్లే సీఈఓ తొలగింపు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి