Share News

Sensex today: స్వల్ప లాభంతో సరి

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:39 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ స్వల్ప లాభాలను నమోదు చేసింది. ఫెడ్‌ రేట్లు తగ్గవచవచ్చన్న అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడింగ్‌ ట్రెండ్‌....

Sensex today: స్వల్ప లాభంతో సరి

సెన్సెక్స్‌ 76 పాయింట్లు అప్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ స్వల్ప లాభాలను నమోదు చేసింది. ఫెడ్‌ రేట్లు తగ్గవచవచ్చన్న అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడింగ్‌ ట్రెండ్‌ బలపడటంతో పాటు ఆటో, కన్స్యూమర్‌ రంగ షేర్లలో కొనుగోళ్లతో సెన్సెక్స్‌ మోస్తరు లాభాల్లో ప్రారంభమైంది. ఒక దశలో 461 పాయింట్ల మేర ఎగిసి 81,171 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరలో మదుపరులు పెద్దఎత్తున లాభాల స్వీకరణకు దిగడంతో సూచీ 76.54 పాయింట్ల లాభంతో 80,787.30 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32.15 పాయింట్ల లాభంతో 24,773.15 వద్ద ముగిసింది.

వచ్చేనెలలో ఎల్‌జీ ఐపీఓ: దక్షిణకొరియాకు చెందిన ఎల్‌జీ ఎలకా్ట్రనిక్స్‌.. భారత విభాగ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)ను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐపీఓ ద్వారా కంపెనీలో 15 శాతం వాటాకు సమానమైన 10.2 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా రూ.15,000 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.

ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌!: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ మరోసారి షేర్ల బైబ్యాక్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 11న జరిగే బోర్డు సమావేశం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. అయితే ఈ బైబ్యాక్‌ ద్వారా ఎన్ని షేర్లను, ఎంత మొత్తానికి బైబ్యాక్‌ చేసేది వెల్లడించలేదు. కంపెనీ డైరెక్టర్ల బోర్డే దీనిపై నిర్ణయం తీసుకోనుంది. 2022లోనూ ఇన్ఫోసిస్‌ కంపెనీ ఒక్కో షేరును రూ.1,830 చొప్పున రూ.9,300 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేసింది. సోమవారం బీఎ్‌సఈలో ఇన్ఫోసిస్‌ షేరు 0.81 శాతం నష్టంతో రూ.1,432.65 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 09 , 2025 | 01:39 AM