Stock Market News: ఆరు రోజుల ర్యాలీకి బ్రేక్
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:56 AM
స్టాక్ మార్కెట్లో ఆరు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ట్రెండ్ నేపథ్యంలో దేశీయంగా మదుపరులు ఐటీ, మెటల్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో...
లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 278 పాయింట్లు డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లో ఆరు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ట్రెండ్ నేపథ్యంలో దేశీయంగా మదుపరులు ఐటీ, మెటల్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో ప్రామాణిక సూచీలు మంగళవారం నష్టాలు చవిచూశాయి. ఒక దశలో 393 పాయింట్ల వరకు పతనమైన సెన్సెక్స్.. చివరికి 277.93 పాయింట్ల నష్టంతో 84,673.02 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 103.40 పాయింట్లు కోల్పోయి 25,910.05 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.52 లక్షల కోట్లు తగ్గి రూ.474.62 లక్షల కోట్లకు జారుకుంది.
రేపటి నుంచి ఇన్ఫీ బైబ్యాక్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.18,000 కోట్ల సొంత షేర్ల తిరిగి కొనుగోలు (బైబ్యాక్) ప్రక్రియ ఈ నెల 20 (గురువారం)న పారంభమై 26న ముగియనుంది. కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద బైబ్యాక్. ఇందులో భాగంగా కంపెనీ 2.41 శాతం వాటాకు సమానమైన 10 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటీ రూ.1,800 చొప్పున చెల్లించి తిరిగి కొనుగోలు చేయనుంది. అర్హులైన షేర్‌హోల్డర్లు ఈ నెల 20-26 మధ్యకాలంలో తమ వద్దనున్న షేర్లను కంపెనీకి ఆఫర్ చేయవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Read Latest AP News And Telugu News