Sensex Crosses 83000: 83000 ఎగువన సెన్సెక్స్
ABN , Publish Date - Sep 19 , 2025 | 05:35 AM
అమెరికాలో వడ్డీ రేట్ల కోత మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. ఫార్మా, ఐటీ, ఫైనాన్షియల్ రంగాల షేర్లు మార్కెట్...
ముంబై: అమెరికాలో వడ్డీ రేట్ల కోత మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. ఫార్మా, ఐటీ, ఫైనాన్షియల్ రంగాల షేర్లు మార్కెట్ లాభాలకు మద్దతు ఇచ్చా యి. దీంతో సెన్సెక్స్ 320 పాయింట్ల లాభంతో 83,013.96 వద్ద ముగియగా నిఫ్టీ 93.35 పాయింట్ల లాభంతో 25,423.60 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 0.36ు లాభపడగా స్మాల్‌క్యాప్ సూచీ మాత్రం 0.01 శాతం నామమాత్రపు నష్టంతో ముగిసింది.
23న నాలుగు ఐపీఓలు: వచ్చే మంగళవారం (23వ తేదీ) నాలుగు తొలి పబ్లిక్ ఇష్యూలు (ఐపీఓ) మార్కెట్ తలుపు తట్టనున్నాయి. వాటిలో ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్, శేషసాయి టెక్నాలజీస్, జారో ఎడ్యుకేషన్, సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ ఇష్యూలన్నీ 25వ తేదీన ముగుస్తాయి. ఆనంద్ రాఠీ షేరు ధర శ్రేణిని రూ.393-414, శేషసాయి టెక్నాలజీస్ షేరు ధర రూ.402-423గా ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి