Sensex 81000: మళ్లీ 81000 పైకి సెన్సెక్స్
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:38 AM
అమెరికా సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించనుందన్న అంచనాలతోపాటు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో పయనించాయి....
ముంబై: అమెరికా సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించనుందన్న అంచనాలతోపాటు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ 314.02 పాయింట్ల లాభంతో 81,101.32 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 95.45 పాయింట్ల వృద్ధితో 24,868.60 వద్ద ముగిసింది. సూచీ లాభపడటం వరుసగా ఇది ఐదో రోజు. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 19 రాణించాయి. సొంత షేర్ల తిరిగి కొనుగోలు (బైబ్యాక్)పై గురువారం నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు 5.03 శాతం ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపా యి మారకం విలువ 3 పైసలు తగ్గి రూ.88.12 వద్ద ముగిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్
ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
For More AP News And Telugu News