Share News

Selling Pressure: గరిష్ఠ స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:06 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం స్వల్ప ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. గరిష్ఠ స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతుండటమే ఇందుకు కారణం. అయితే జీఎ్‌సటీ సంస్కరణల...

Selling Pressure: గరిష్ఠ స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం స్వల్ప ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. గరిష్ఠ స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతుండటమే ఇందుకు కారణం. అయితే జీఎ్‌సటీ సంస్కరణల నేపథ్యంలో సానుకూల సెంటిమెంట్‌ నెలకొని సంబంధిత రంగాల షేర్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మైనింగ్‌, ఆటోమొబైల్‌, నాన్‌ ఫెర్రస్‌ మెటల్స్‌, ఎలక్ట్రికల్స్‌, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ రంగాలు బలంగా ఉన్నాయి.

స్టాక్‌ రికమండేషన్స్‌

భారతి ఎయిర్‌టెల్‌: జీవితకాల గరిష్ఠాన్ని చేరిన తర్వాత ఈ కౌంటర్‌లో స్వల్ప దిద్దుబాటు జరిగింది. ప్రస్తుతం మూమెంటమ్‌ గణనీయం గా పెరిగింది. పైగా షేరు కీలక నిరోధ స్థాయిని అధిగమించే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1,962 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,950 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.2,025/2,050 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.1,930 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

యూనియన్‌ బ్యాంక్‌: గరిష్ఠ స్థాయిని చేరుకున్న తర్వాత ఈ కౌంటర్‌లో దిద్దుబాటు జరిగింది. ప్రస్తుతం మూమెంటమ్‌, వాల్యూమ్‌, రిలేటివ్‌ స్ట్రెంత్‌ గణనీయంగా పెరిగాయి. పైగా పీఎ్‌సయూ బ్యాంకింగ్‌ రంగం జోరందుకుంటోంది. గత శుక్రవారం రూ.140 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.130 శ్రేణిలో ప్రవేశించి రూ.155 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.131 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌స్‌ గా పెట్టుకోవాలి.


గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌: జీఎ్‌సటీ సంస్కరణల నేపథ్యంలో రియల్టీపై ఫోకస్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ షేరుపై మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. స్వల్ప, మధ్యకాలిక మూమెంటమ్‌ పెరుగుతండటం గమనార్హం. గత శుక్రవారం రూ.2,145 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,080 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.2,145 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.2,050 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బీపీసీఎల్‌: ఈ ఏడాది జూలైలో రూ.355 వద్ద గరిష్ఠ స్థాయిని తాకిన ఈ షేరు ప్రస్తుతం అక్యుములేషన్‌ జోన్‌లో ఉంది. అన్ని రకాల కాల వ్యవధుల్లో మూమెంటమ్‌ మెరుగవుతోంది. గత శుక్రవారం రూ.329 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.320 ఎగువన పొజిషన్‌ తీసుకుని రూ.380 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.300 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

అర్బన్‌ కంపెనీ లిమిటెడ్‌: గత వారమే లిస్టయిన ఈ కౌంటర్‌ ఆకర్షణీయంగా ఉంది. గత శుక్రవారం రూ.184 వద్ద ముగిసిన ఈ షేరును దీర్ఘకాలానికి రూ.160-180 శ్రేణిలో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 05:06 AM