Share News

Gigital gold trading: డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్‌తో జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్..

ABN , Publish Date - Nov 08 , 2025 | 08:49 PM

బంగారంపై పెట్టుబడుల కోసం ఇటీవలి కాలంలో చాలామంది డిజిటల్ గోల్డ్‌ పై ఆధారపడుతున్నారు. భారీ లాభాలు వస్తాయనే ఆశతో విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఈ తరహా కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.

Gigital gold trading: డిజిటల్ గోల్డ్ ట్రేడింగ్‌తో జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్..
digital gold trading

బంగారంపై పెట్టుబడుల కోసం ఇటీవలి కాలంలో చాలామంది డిజిటల్ గోల్డ్‌ (Gigital gold)పై ఆధారపడుతున్నారు. భారీ లాభాలు వస్తాయనే ఆశతో విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఈ తరహా కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక సూచన చేసింది (SEBI warning about digital gold).


డిజిటల్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లభించే బంగారం ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సూచించింది. డిజిటల్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల కొన్ని సందర్భాలలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. భౌతికంగా బంగారం కొనుగోలు చేయడానికి ప్రత్యామ్నాయంగా ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్ బాగా ప్రాచుర్యం పొందింది. అటువంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ నియంత్రణ పరిధిలోకి రావని సెబీ స్పష్టం చేసింది (online investment alert).


ప్రస్తుత చట్టాల ప్రకారం డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు సెక్యూరిటీలు గానీ, కమోడిటీ డెరివేటివ్‌లు గానీ కావని, కాబట్టి వాటికి సెబీ నియంత్రణ వర్తించదని స్పష్టం చేసింది (online gold trading). అవి పూర్తిగా సెబీ వెలుపల పనిచేస్తాయని పేర్కొంది. అలాంటి ఉత్పత్తులకు సెక్యూరిటీల మార్కెట్ పరిధిలోని పెట్టుబడిదారులకు అందించే రక్షణ విధానాలు ఏవీ వర్తించవని ప్రకటనలో తెలిపింది. డిజిటల్ గోల్డ్‌లో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్క్‌లు పొంచి ఉంటాయని హెచ్చరించింది.


ఇవీ చదవండి:

మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ

Nifty Stock Market: 25500 దిగువకు నిఫ్టీ

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 08:57 PM