Share News

పీఎస్‌యూల డీలిస్టింగ్‌కు ప్రత్యేక విధానం

ABN , Publish Date - May 07 , 2025 | 05:42 AM

ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) స్వచ్ఛంద డీలిస్టింగ్‌ను సులభతరం చేయాలని మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ యోచిస్తోంది. ఇందుకోసం అనుసరించాల్సిన విధి...

పీఎస్‌యూల డీలిస్టింగ్‌కు ప్రత్యేక విధానం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) స్వచ్ఛంద డీలిస్టింగ్‌ను సులభతరం చేయాలని మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ యోచిస్తోంది. ఇందుకోసం అనుసరించాల్సిన విధి విదానాలతో ఒక చర్చా పత్రం విడుదల చేసింది. ఈ చర్చా పత్రంపై మార్కెట్‌ వర్గాలు ఈనెల 26లోగా తమ స్పందన తెలియజేయాలని కోరింది.

చర్చా పత్రం ముఖ్యాంశాలు

  • మొత్తం ఈక్విటీలో ప్రమోటర్‌, ప్రమోటర్‌ గ్రూప్‌, ఇతర పీఎస్‌యూలు 90 శాతానికి పైగా వాటా కలిగి ఉండాలి

  • ఇలాంటి పీఎ్‌సయూల ఈక్విటీలో కనీస పబ్లిక్‌ వాటా లేకపోయినా డీలిస్ట్‌ కావచ్చు

  • పీఎస్‌యూలు ఒక నిర్ణీత ధర వద్ద కూడా తమ షేర్లను డీలిస్ట్‌ చేయవచ్చు

  • షేర్ల ట్రేడింగ్‌ ఫ్రీక్వెన్సీతో సంబంధం లేకుండా డీలిస్టింగ్‌ షేర్ల కనీస ధరపై 15 శాతం ప్రీమియం ఉండాలి

  • మూడింట రెండు వంతుల మంది వాటాదారుల ఆమోదం నిబంధన పీఎస్‌యూల డీలిస్టింగ్‌కు వర్తించదు.

ఇవి కూడా చదవండి:

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Indian Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..ఈ కంపెనీలకు బిగ్ లాస్

ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..

Read More Business News and Latest Telugu News

Updated Date - May 07 , 2025 | 05:42 AM