SEBI, Commodities Market: కమోడిటీస్ మార్కెట్ విస్తరణకు కృషి
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:28 AM
దేశంలో కమోడిటీస్ మార్కెట్ విస్తరణకు కట్టుబడి ఉన్నట్టు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ తెలిపింది. ఇందులో భాగం గా వ్యవసాయేతర ఉత్పత్తుల...
సెబీ చైర్మన్ పాండే
ముంబై: దేశంలో కమోడిటీస్ మార్కెట్ విస్తరణకు కట్టుబడి ఉన్నట్టు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ తెలిపింది. ఇందులో భాగం గా వ్యవసాయేతర ఉత్పత్తుల డెరివేటివ్స్ ట్రేడింగ్‌లోకి బ్యాంకులు, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్లను అనుమతించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే వెల్లడించారు. మల్టీ కమోడిటీస్ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్) నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ఈ విషయం వెల్లడించారు. నాన్ క్యాష్ సెటిల్డ్, వ్యవసాయేతర కమోడిటీ్‌సలోకి విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)ను అనుమతించే విషయాన్నీ సెబీ పరిశీస్తోంది. ప్రభుత్వంతో చర్చించాక వీటిపై నిర్ణయం తీసుకుంటామని పాండే తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కమోడిటీస్ డెరివేటివ్ మార్కెట్లది కీలక పాత్ర అని పాండే చెప్పారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి