Adani Clean Chit: హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. అదానీకి సెబీ క్లీన్ చిట్.. రియాక్షన్ ఏంటంటే..
ABN , Publish Date - Sep 18 , 2025 | 08:53 PM
హిండెన్‌బర్గ్ ఆరోపణలతో దేశవిదేశాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ కంపెనీలకు సెబీ క్లీన్‌చిట్ ఇచ్చింది. అదానీ గ్రూప్ అకౌంటింగ్ మోసాలు, స్టాక్ అవకతవకలకు పాల్పడుతోందని అమెరికా షార్ట్ సెల్లర్ కంపెనీ చేసిన ఆరోపణలు నిజం కావని సెబీ తేల్చి చెప్పింది.
ఢిల్లీ: హిండెన్‌బర్గ్ ఆరోపణలతో దేశవిదేశాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ కంపెనీలకు సెబీ క్లీన్‌చిట్ ఇచ్చింది (SEBI verdict). అదానీ గ్రూప్ అకౌంటింగ్ మోసాలు, స్టాక్ అవకతవకలకు పాల్పడుతోందని అమెరికా షార్ట్ సెల్లర్ కంపెనీ చేసిన ఆరోపణలు నిజం కావని సెబీ తేల్చి చెప్పింది. అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల్లోకి నిధులు మళ్లించినట్టు ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదని పేర్కొంది. సెబీ క్లీన్‌చిట్‌పై అదానీ గ్రూప్ కంపెనీ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు (Adani clean chit).
'హిండెన్‌బర్గ్ ఆరోపణలు అవాస్తవాలని మరోసారి రుజువైంది. మేం ఎప్పట్నుంచో ఇదే విషయం చెబుతున్నాం. ఈ కుట్రపూరిత నివేదిక కారణంగా నష్టాలు చవిచూసిన పెట్టుబడిదారులను తలచుకుంటే బాధగా ఉంది. మా కంపెనీలపై తప్పుడు ప్రచారాలు చేసిన వారు ఇప్పుడు దేశానికి క్షమాపణలు చెప్పాలి. జాతి నిర్మాణంలో మా నిబద్ధత ఎప్పటికీ కొనసాగుతుంది. సత్యమేవ జయతే.. జైహింద్..' అని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు (Gautam Adani response).
అదానీ గ్రూప్ కంపెనీలు అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతున్నాయని, నిధులు మళ్లింపు జరిగిందని అమెరికా షార్ట్ సెల్లర్ కంపెనీ అయిన హిండెన్‌బర్గ్ 2023 జనవరిలో ఆరోపణలు చేసింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీలు దారుణంగా నష్టపోయాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన అన్ని సంస్థల మార్కెట్ వాల్యూ పడిపోయింది. ఎన్నో వేల మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోయారు (Adani Group transparency). ఆ తర్వాత అదానీ గ్రూప్ సంస్థల కంపెనీలు కోలుకున్నాయి. తాజాగా సెబీ క్లీన్‌చిట్ లభించడంతో మరింత ఊరట లభించినట్టైంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి