Share News

SBI IMPS Charges: ఎస్‌బీఐ ఐఎంపీఎస్‌ ఛార్జీలు పెంపు

ABN , Publish Date - Aug 14 , 2025 | 02:29 AM

వడ్డీయేతర ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆగస్టు 15 నుంచి ఇమీడియెట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (ఐఎంపీఎస్‌) ఛార్జీలను సవరిస్తోంది. ఈ సవరణ ఆన్‌లైన్‌ చెల్లింపులకు...

SBI IMPS Charges: ఎస్‌బీఐ ఐఎంపీఎస్‌ ఛార్జీలు పెంపు

రేపటి నుంచి అమలు

న్యూఢిల్లీ: వడ్డీయేతర ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆగస్టు 15 నుంచి ఇమీడియెట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (ఐఎంపీఎస్‌) ఛార్జీలను సవరిస్తోంది. ఈ సవరణ ఆన్‌లైన్‌ చెల్లింపులకు ఒకలా, బ్రాంచ్‌ నెట్‌వర్క్‌ ద్వారా చేసే చెల్లింపులకు ఒకలా ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న ఉచిత ఐఎంపీఎస్‌ చెల్లింపుల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25,000కు కుదించారు. ఆగస్టు 15 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు జరిగే ఐఎంపీఎస్‌ చెల్లింపులపై రూ.2+జీఎ్‌సటీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జరిగే చెల్లింపులపై రూ.6+జీఎ్‌సటీ, రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు జరిగే చెల్లింపులపై రూ.10+జీఎ్‌సటీ వసూలు చేయనున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. ఇక బ్రాంచిల ద్వారా జరిగే ఐఎంపీఎస్‌ చెల్లింపులపై వసూలు చేసే ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఎప్పటిలానే ఈ చెల్లింపులపై కనిష్ఠంగా రూ.2+జీఎ్‌సటీ, గరిష్ఠంగా రూ.20+జీఎ్‌సటీ వసూలు చేస్తారు. అయితే వేతన ఖాతాదారులకు మాత్రం ఎప్పటిలా ఈ సేవలు ఉచితమని ఎస్‌బీఐ తెలిపింది. కెనరా బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కూడా ఆగస్టు 15 నుంచి తమ ఐఎంపీఎస్‌ ఛార్జీలను సవరిస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 02:29 AM