SBI Completes Sale Stake: యస్ బ్యాంక్‌లో 13.18 శాతం వాటా
ABN , Publish Date - Sep 18 , 2025 | 02:52 AM
యస్ బ్యాంక్ ఈక్విటీలో తన వాటాను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) 10.8 శాతానికి తగ్గించుకుంది. ఇందులో తనకున్న...
విక్రయం పూర్తి : ఎస్‌బీఐ
న్యూఢిల్లీ: యస్ బ్యాంక్ ఈక్విటీలో తన వాటాను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) 10.8 శాతానికి తగ్గించుకుంది. ఇందులో తనకున్న 23.98 శాతం వాటాలో 13.18 శాతం వాటాను జపాన్ కేంద్రంగా పనిచేసే సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్‌ఎంబీసీ)కు విక్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డీల్ పూర్తయినట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఈ అమ్మకం ద్వారా రూ.8,889 కోట్లు సమకూరినట్టు స్టాక్ ఎక్స్ఛేంజీలకు బ్యాంక్ తెలిపింది. 2020 మార్చిలో యస్ బ్యాంక్ కుప్పకూలినప్పుడు ప్రభుత్వం, ఆర్‌బీఐ ఆదేశాలతో ఎస్‌బీఐ రెండు విడతలుగా ఈ బ్యాంక్ ఈక్విటీలో ఈ వాటాలు తీసుకుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి