SBI Challa Srinivasulu Shetty: ఆర్థిక మోసాల నిరోధానికి నేషనల్ ఫైనాన్షియల్ గ్రిడ్
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:58 AM
దేశంలో ఆర్థిక మోసాలను నిరోధించడంతో పాటు రిస్క్ నిర్వహణ కోసం ఆర్థిక సేవల రంగానికి చెందిన కీలక విభాగాలను అనుసంధానిస్తూ నేషనల్ ఫైనాన్షియల్ గ్రిడ్ (ఎన్‌ఎ్‌ఫజీ)ను ఏర్పాటు చేయాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) చైర్మన్...
ఏర్పాటు చేయాలన్న ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి
ముంబై: దేశంలో ఆర్థిక మోసాలను నిరోధించడంతో పాటు రిస్క్ నిర్వహణ కోసం ఆర్థిక సేవల రంగానికి చెందిన కీలక విభాగాలను అనుసంధానిస్తూ నేషనల్ ఫైనాన్షియల్ గ్రిడ్ (ఎన్‌ఎ్‌ఫజీ)ను ఏర్పాటు చేయాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి కోరారు. క్రెడిట్ రేటింగ్ బ్యూరోలు, ఫ్రాడ్ రిజిస్ట్రీలు, ఈ-కేవైసీ వసతులు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ), అకౌంట్ అగ్రిగేటర్లతో పాటు ఈ మధ్యనే ప్రవేశపెట్టిన యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫే్‌స (యూఎల్‌ఐ)ను ఈ గ్రిడ్‌తో అనుసంధానించాలని శెట్టి అన్నా రు. ముంబైలో జరుగుతున్న సీఐఐ ఫైనాన్షియల్ సమ్మిట్‌లో మంగళవారం పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ సూచన చేశారు. ఆర్థిక రంగ వర్గాలు ఏకమై లాభాపేక్ష లేని సంస్థ ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశాయి. వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడమే అంతిమ లక్ష్యంగా రియల్ టైం డేటాను ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా ఏర్పాటైన డిజిటల్ మౌలిక సదుపాయం ఇది.
చిన్న వ్యాపారుల కోసం డిజిటల్ ట్విన్: చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు తీసుకునేందుకు వీలుగా ‘డిజిటల్ ట్విన్’ను ఏర్పాటు చేయాలని కూడా ఎస్‌బీఐ చైర్మన్ శెట్టి సూచించారు. ఈ డిజిటల్ ట్విన్ వ్యాపార సంస్థకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది. ఆ సమాచారం వ్యాపార సంస్థ ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా తెలియజేయడంతో పాటు ఆ సంస్థ సులభంగా ఆర్థిక సేవలందుకునేందుకు దోహదపడుతుంది. అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టినప్పటికీ, అది పూర్తిగా నెరవేరలేదు.
దాంతో చిన్న వ్యాపారాలు అసంఘటిత, అనియంత్రిత సంస్థల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకోవాల్సి వస్తోందని శెట్టి పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మఽధ్య తరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ)కు రుణాలిచ్చే విషయంలో సత్సంబంధాల ఆధారిత విధానానికి బదులు పూర్తిగా డేటా ఆధారిత విధానాన్ని అనుసరించేందుకు డిజిటల్ ట్విన్ తోడ్పడుతుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Read Latest AP News And Telugu News