Share News

Sangam Dairy: సంగం టర్నోవర్‌ లక్ష్యం రూ 2300 కోట్లు

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:44 AM

సంగం డెయిరీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,019 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. వచ్చే ఏడాది రూ.2,300 కోట్ల టర్నోవర్‌ సాధించాలని...

Sangam Dairy: సంగం టర్నోవర్‌ లక్ష్యం రూ 2300 కోట్లు

త్వరలో వరంగల్‌లో ఉత్పత్తుల విక్రయం: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌

పొన్నూరుటౌన్‌ (ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,019 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. వచ్చే ఏడాది రూ.2,300 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ వెల్లడించారు. వడ్లమూడిలో సోమవారం వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) మాట్లాడుతూ ప్రస్తుతం సంగం డెయురీ రోజుకు 8.20 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించి దాని ద్వారా మరిన్ని నూతన ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడతామన్నారు. గత ఐదేళ్లుగా తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యిని కూడా సరఫరా చేస్తున్నట్టు చైర్మన్‌ తెలిపారు. త్వరలో సంగం ఉత్పత్తులను తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలోనూ విక్రయిస్తామన్నారు. నాయుడుపేట సెజ్‌లో కేటాయించిన భూమిలో త్వరలోనే కొత్త ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి

ట్రోఫీ తీసుకెళ్లిపోయిన పీసీబీ చీఫ్.. మండిపడ్డ బీసీసీఐ సెక్రెటరీ

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా భారీ ఎస్‌యూవీ..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2025 | 05:44 AM