Samsung Launches Galaxy A17 5G: మార్కెట్లోకి సామ్‌సంగ్
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:31 AM
సామ్‌సంగ్ ఇండియా మార్కెట్లోకి గెలాక్సీ ఏ17 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది. సోమవారం నాడిక్కడ కంపెనీ ఎంఎక్స్ బిజినెస్, వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండగల సీజన్‌ను పురస్కరించుకుని...
గెలాక్సీ ఏ17 5జీ స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సామ్‌సంగ్ ఇండియా మార్కెట్లోకి గెలాక్సీ ఏ17 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది. సోమవారం నాడిక్కడ కంపెనీ ఎంఎక్స్ బిజినెస్, వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండగల సీజన్‌ను పురస్కరించుకుని గెలాక్సీ ఏ సీరిస్ విభాగంలో ఏ17ను అత్యుత్తమ ఏఐ ఫీచర్లు, సెక్యూరిటీ ఫీచర్లు, అందుబాటు ధరల్లో తీసుకువచ్చినట్లు చెప్పారు. 50 ఎంపీ ప్రధాన కెమెరా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోలిడ్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలని ఆయన తెలిపారు. 6జీబీ ప్లస్ 128 జీబీ మెమరీ, 8జీబీ ప్లస్ 128 జీబీ మెమరీ, 8జీబీ ప్లస్ 256 జీబీ మెమరీతో అందుబాటులో ఉండనున్న గెలాక్సీ ఏ17 5జీ స్మార్ట్‌ఫోన్ ధరలు వరుసగా రూ.18,999, రూ.20,499, రూ.23,499గా ఉన్నాయి. 2019లో గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాగా ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం 9.6 కోట్ల ఫోన్లను విక్రయించినట్లు బబ్బర్ తెలిపారు. డిసెంబరు నాటికి వీటి విక్రయాలు 10 కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నట్లు బబ్బర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి