Share News

Sampray Nutrition Partners with RCPL: ఆర్‌సీపీఎల్‌తో సాంప్రే న్యూట్రిషన్స్‌ జట్టు

ABN , Publish Date - Oct 29 , 2025 | 05:51 AM

తెలంగాణకు చెందిన సాంప్రే న్యూట్రిషన్స్‌.. రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీపీఎల్‌)తో జట్టు కట్టింది. ఒప్పందంలో భాగంగా ఆర్‌సీపీఎల్‌ కోసం...

Sampray Nutrition Partners with RCPL: ఆర్‌సీపీఎల్‌తో సాంప్రే న్యూట్రిషన్స్‌ జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణకు చెందిన సాంప్రే న్యూట్రిషన్స్‌.. రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీపీఎల్‌)తో జట్టు కట్టింది. ఒప్పందంలో భాగంగా ఆర్‌సీపీఎల్‌ కోసం పోషకాహార ఉత్పత్తుల తయారీ, సరఫరాను సాంప్రే చేపట్టనుంది. ఈ ఒప్పంద కాలపరిమితి మూడేళ్లు. ఆర్‌సీపీఎల్‌ భాగస్వామ్యంతో ఏటా రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల వ్యాపారం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు సాంప్రే వెల్లడించింది. కాగా సాంప్రే ఇటీవల వివిధ కంపెనీలతో రూ.45 కోట్ల విలువైన తయారీ, సరఫరా ఒప్పందాలను కుదుర్చుకుంది. ఫారిన్‌ కరెన్సీ కన్వర్టబల్‌ బాండ్ల జారీ ద్వారా రూ.355 కోట్లు సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 05:51 AM