Share News

Sai Parentals IPO: సాయి పేరెంటరల్స్‌ రూ 110 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Dec 05 , 2025 | 05:50 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సాయి పేరెంటరల్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌పీఎల్‌).. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. కంపెనీ ఇప్పటికే మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా పత్రాలు...

Sai Parentals IPO: సాయి పేరెంటరల్స్‌ రూ 110 కోట్ల పెట్టుబడులు

రూ.26 కోట్లతో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌

ఐపీఓ ద్వారా రూ.285 కోట్ల సమీకరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సాయి పేరెంటరల్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌పీఎల్‌).. పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. కంపెనీ ఇప్పటికే మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించిందని కంపెనీ ఎండీ కే అనిల్‌ కుమార్‌ వెల్లడించారు. ఐపీఓలో భాగంగా తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.285 కోట్లు సమీకరించనుండగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ.125 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారని ఆయన తెలిపారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.110 కోట్లను ప్లాంట్ల ఆధునికీకరణ, సాధారణ కార్పొరేట్‌ అవసరాలతో పాటు ఇటీవల ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన న్యూమెడ్‌ ఫార్మా కోసం వినియోగించనున్నట్లు అనిల్‌ చెప్పారు. ప్రస్తుతం కంపెనీ తెలంగాణలో నాలుగు ప్లాంట్లను నిర్వహిస్తోంది. బ్రాండెడ్‌ జెనరిక్‌ ఫార్ములేషన్స్‌తో పాటు కాంట్రాక్ట్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఏంఓ) సేవలను అందిస్తోంది. భారత్‌తో పాటు ఫిలిప్పీన్స్‌, దుబాయ్‌, సౌదీ అరేబియా మార్కెట్లకు ఔషధాలను ఎగుమతి చేస్తోంది. తాజాగా న్యూమెడ్‌ కొనుగోలుతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు మరికొన్ని రెగ్యులేటెడ్‌ మార్కెట్లకు తన కార్యకలాపాలను విస్తరించనుంది.

వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి న్యూమెడ్‌ ప్లాంట్‌ రెడీ: కాగా హైదరాబాద్‌ బొల్లారంలో కొత్తగా ఆర్‌ అండ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అనిల్‌ తెలిపారు. ఇందుకోసం రూ.26 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఈ సెంటర్‌ అందుబాటులోకి రానుందన్నారు. అలాగే ఆస్ట్రేలియాలోని న్యూమెడ్‌ ఫార్మా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌ వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికల్లా అందుబాటులోకి రానుందన్నారు. రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా 2027 జనవరి నుంచి వాణిజ్యపరంగా ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం కానుందని అనిల్‌ వివరించారు.

ఇవీ చదవండి:

రూపాయి గాయానికి ఆర్‌బీఐ మందేమిటో..

జనరిక్‌ సెమాగ్లుటైడ్ తయారీకి డాక్టర్‌ రెడ్డీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 05 , 2025 | 05:50 AM