Rupee Slides Amid: రూపాయికి సుంకాల పోటు
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:23 AM
ట్రంప్ సుంకాల ధాటికి మన కరెన్సీ విలువ వేగంగా కరుగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. మరో పైసా నష్టపోయి రూ.88.10 వద్ద ముగిసింది. రూ.88.33 వద్ద ఆల్‌టైమ్ ఇంట్రాడే...
త్వరలో రూ.90కి చేరే అవకాశం
సరికొత్త ఆల్‌టైం కనిష్ఠానికి పతనం
రూ.88.10కి చేరిక
ముంబై: ట్రంప్ సుంకాల ధాటికి మన కరెన్సీ విలువ వేగంగా కరుగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. మరో పైసా నష్టపోయి రూ.88.10 వద్ద ముగిసింది. రూ.88.33 వద్ద ఆల్‌టైమ్ ఇంట్రాడే కనిష్ఠాన్ని సైతం నమోదు చేసింది. స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనించినప్పటికీ.. ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాల ప్రభావంతో పాటు అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న అనిశ్చితి, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం ఇందుకు కారణమైంది. మన కరెన్సీకి మద్దతుగా ఫారెక్స్ మార్కెట్ కార్యకలాపాల్లో ఆర్‌బీఐ జోక్యం చేసుకునేందుకు అవకాశాలున్నప్పటికీ, అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో రూపాయిపై ఒత్తిడి కొనసాగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మున్ముందు నెలల్లో డాలర్-రూపీ ఎక్స్ఛేంజ్ రేటు రూ.90కి చేరే అవకాశాల్లేకపోలేవని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్త అదితి గుప్తా అన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి