23 రోజుల్లోనే రైట్స్ ఇష్యూలు పూర్తికావాలి : సెబీ
ABN , Publish Date - Mar 12 , 2025 | 02:19 AM
కంపెనీల రైట్స్ ఇష్యూలను సెబీ బాగా కుదించింది. ప్రస్తుతం కంపెనీలు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం పొందినప్పటి నుంచి 317 రోజుల్లో రైట్స్ ఇష్యూలు పూర్తి చేయాలి...

కంపెనీల రైట్స్ ఇష్యూలను సెబీ బాగా కుదించింది. ప్రస్తుతం కంపెనీలు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం పొందినప్పటి నుంచి 317 రోజుల్లో రైట్స్ ఇష్యూలు పూర్తి చేయాలి. సెబీ దీన్ని తాజాగా 23 రోజులకు కుదించింది. అంతేగాక ఈ ఇష్యూల కోసం ముందుగా తనకు ఎలాంటి దరఖాస్తులు పంపాల్సిన అవసరం లేదని స్పష్టించింది. అయితే కంపెనీ షేర్లు లిస్టయిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు మాత్రం విషయం తెలియజేయాలని కోరింది. రైట్స్ ఇష్యూలకు మర్చంట్ బ్యాంకర్ల నియామకం కూడా ఇక కంపెనీల ఇష్టమని తెలిపింది. వీటికి తోడు రైట్స్ ఇష్యూలను వారం నుంచి నెల రోజుల వరకు సబ్‌స్ర్కిప్షన్ కోసం ఓపెన్ చేసి ఉంచాలని స్పష్టం చేసింది.
Read Also : 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన..
Business Ideas: మీ దగ్గర రూ.1000 లు ఉంటే చాలు.. ఈ వ్యాపారంలో నెలకు మినిమం రూ.30 వేల ప్రాఫిట్..
Airtel - Space X Deal: ఎయిర్ టెల్ సాయంతో స్టార్‌లింక్ భారత్‌లోకి ఎంట్రీ.. స్పేస్ ఎక్స్