Share News

Airtel - Space X Deal: ఎయిర్ టెల్ సాయంతో స్టార్‌లింక్ భారత్‌లోకి ఎంట్రీ.. స్పేస్ ఎక్స్‌‌ కీలక డీల్‌

ABN , Publish Date - Mar 11 , 2025 | 06:28 PM

భారత్‌ మార్కెట్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ ఈ దిశగా కీలక ముందడుగు వేసింది. ఎయిర్‌టెల్‌, స్టార్‌లింక్‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది.

Airtel - Space X Deal: ఎయిర్ టెల్ సాయంతో స్టార్‌లింక్ భారత్‌లోకి ఎంట్రీ.. స్పేస్ ఎక్స్‌‌ కీలక డీల్‌

ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్ సారథ్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించే దిశగా కీలక ముందడుగు పడింది. భారత్‌లో కలిసి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎయిర్‌టెల్, స్పెస్ ఎక్స్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం, స్టార్‌లింక్ పరికరాలను ఎయిర్‌టెల్ తన కేంద్రాల ద్వారా విక్రయించే అవకాశం ఉంది. అంతేకాకుండా స్టార్‌లింక్ సేవలను వ్యాపారవర్గాలకు కూడా అందుబాటులోకి తేవొచ్చు. స్టార్‌లింక్ సేవలు గ్రామణ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఇతర మారుమూల ప్రాంతాలకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్‌టెల్ నెట్వర్క్‌ను బలోపేతం చేసేందుకు స్టార్‌లింక్ సేవలను ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై కూడా ఇరు సంస్థలు దృష్టి పెట్టనున్నాయి. ఈ మేరకు ఎయిర్‌టెల్ ఓ ప్రకటన విడుదల చేసింది (Airtel - Space X Deal).


Gold Price Dubai Vs India: భారత్‌తో పోలిస్తే దుబాయ్‌ బంగారం ధర ఎందుకు తక్కువంటే..

‘‘స్పేస్‌ఎక్స్ సంస్థతో కలిసి స్టార్‌లింక్ సేవలను ఎయిర్‌టెల్ కస్టమర్లకు అందించడం ఓ మైలురాయి. కొత్త తరం శాటిలైట్ కనెక్టివిటీని భారతీయులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్‌టెల్ కట్టుబడి ఉందనేందుకు ఇదో గొప్ప ఉదాహరణ’’ అని భారతీ ఎయిర్‌టె్ మానేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు.

ఇరు సంస్థల మధ్య సహకారంతో భారత్‌లోని మారు మూల ప్రాంతాలకు కూడా వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించే సామర్థ్యం ఎయిర్‌టెల్‌కు వస్తుందని తెలిపారు. ప్రతి వ్యక్తి, సంస్థ, సమాజానికి నమ్మకమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భారతీయ కస్టమర్లకు మరింత అందుబాటు ధరల్లో సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

Indian Talking Loudly At Airport: అస్సలు మర్యాద లేదు.. సాటి భారతీయుడిని తిట్టిపోసిన ఎన్నారై!


ఈ ఒప్పందంపై స్పేస్ ఎక్స్ ప్రెసిడెంట్ గ్వైన్ షాట్‌వెల్ కూడా స్పందించారు. ఎయిర్‌టెల్‌తో కలిసి పనిచేసేందుకు తామెంతో ఉత్సుకతతో ఉన్నామని అన్నారు. స్టార్‌లింక్‌ భారత్‌లో విప్లవాత్మక ప్రభావం చూపిస్తుందని చెప్పారు. భారత టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ సారథ్యంలోని అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ అనుబంధ సంస్థ స్టార్‌లింక్ అన్న విషయం తెలిసిందే. శాటిలైట్ సాయంతో మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు మస్క్ స్టార్ లింక్ ప్రారంభించారు.

God equation theory: దేవుడి ఉనికికి గణిత ఫార్ములాతో ప్రూఫ్.. హార్వర్డ్ శాస్త్రవేత్త స్టేట్‌మెంట్

Read Latest and Business News

Updated Date - Mar 11 , 2025 | 06:33 PM