Retail Inflation Drops: 8 ఏళ్ల కనిష్ఠానికి ద్రవ్యోల్బణం
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:05 AM
రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబరు నెలలో 8 సంవత్సరాల కనిష్ఠ స్థాయి 1.54 శాతానికి దిగి వచ్చింది. ఆగస్టు నెలలో ఇది 2.07ు ఉండగా గత ఏడాది సెప్టెంబరులో 5.49ు ఉంది. ఆహార వస్తువుల ధరలు...
2017 జూన్ తర్వాత ఇదే ప్రథమం
సెప్టెంబరులో 1.54 శాతంగా నమోదు
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబరు నెలలో 8 సంవత్సరాల కనిష్ఠ స్థాయి 1.54 శాతానికి దిగి వచ్చింది. ఆగస్టు నెలలో ఇది 2.07ు ఉండగా గత ఏడాది సెప్టెంబరులో 5.49ు ఉంది. ఆహార వస్తువుల ధరలు ప్రత్యేకించి కూరగాయలు, పళ్లు, పప్పు దినుసుల ధరలు గణనీయంగా తగ్గడం ఇందుకు కారణం. 2017 జూన్‌లో నమోదైన 1.46ు తర్వాత నమోదైన కనిష్ఠ స్థాయి ఇదే. అలాగే ఈ ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం 2ు కన్నా దిగువకు రావడం ఇది రెండో సారి. ప్రభుత్వం ఆర్‌బీఐకి నిర్దేశించిన ద్రవ్యోల్బణం కట్టడి పరిధిలో (2ు పైకి లేదా దిగువకు సద్దుబాటుతో 4ు అంటే 2-6ు) కనిష్ఠ స్థాయి కన్నా దిగి వచ్చినట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. సెప్టెంబరు నెలలో ద్రవ్యోల్బణం 53 బేసిస్ పాయింట్లు (0.53ు) తగ్గిందని ఎన్‌ఎ్‌సఓ తెలిపింది. ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో (-) 0.64ు ఉండగా సెప్టెంబరులో (-) 2.28 శాతానికి తగ్గింది. గత ఏడాది సెప్టెంబరులో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 9.24 శాతంగా ఉంది.
కేరళలో గరిష్ఠం
రాష్ర్టాల వారీగా చూసినట్టయితే సెప్టెంబరు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం కేరళలో గరిష్ఠంగా 9.05ు ఉండగా ఉత్తరప్రదేశ్‌లో కనిష్ఠంగా (-) 0.61 శాతంగా నమోదైంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 1.07ు ఉండగా పట్టణ ప్రాంతాల్లో 2.04 శాతంగా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News