Share News

RC Plasto Launches: ప్లాస్టో నుంచి కొత్త ఉత్పత్తులు

ABN , Publish Date - Sep 19 , 2025 | 05:36 AM

ఆర్‌సీ ప్లాస్టో ట్యాంక్స్‌ అండ్‌ పైప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. మార్కెట్లోకి ప్లాస్టో బకెట్‌, మగ్గులను విడుదల చేసింది. వినియోగదారుల రోజువారీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ...

RC Plasto Launches: ప్లాస్టో నుంచి కొత్త ఉత్పత్తులు

హైదరాబాద్‌: ఆర్‌సీ ప్లాస్టో ట్యాంక్స్‌ అండ్‌ పైప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. మార్కెట్లోకి ప్లాస్టో బకెట్‌, మగ్గులను విడుదల చేసింది. వినియోగదారుల రోజువారీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఈ కొత్త ఉత్పత్తులను డిజైన్‌ చేసినట్లు కంపెనీ తెలిపింది. వంద శాతం ఫుడ్‌ గ్రేడ్‌ ప్లాస్టిక్‌తో వీటిని తయారు చేసినట్లు పేర్కొంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే విధంగా యూవీ ప్రొటెక్షన్‌ టెక్నాలజీతో ఈ ఉత్పత్తులను తీసుకువచ్చినట్లు తెలిపింది. ఐదేళ్ల వారంటీతో కూడిన బకెట్‌ 5, 25 లీటర్లు, మగ్గులు ఒక లీటర్‌, 1.5 లీటర్‌ సామర్థ్యాలతో అందుబాటులో ఉంటాయని ఆర్‌సీ ప్లాస్టో వెల్లడించింది. ఈ ఉత్పత్తులు ఆర్‌సీ ప్లాస్టో అధీకృత డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 05:37 AM