Share News

RBI Guidelines: ఆర్థిక ఉత్పత్తుల మోసపూరిత విక్రయాలకు చెక్‌

ABN , Publish Date - Dec 30 , 2025 | 07:12 AM

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తన నియంత్రణల పరిధిలో ఉన్న కంపెనీలు వినియోగదారులకు ఆర్థిక ఉత్పత్తులు, సేవలు మోసపూరితంగా విక్రయించడాన్ని నిలువరించే దిశగా...

RBI Guidelines: ఆర్థిక ఉత్పత్తుల మోసపూరిత విక్రయాలకు చెక్‌

సమగ్ర నిబంధనలపై ఆర్‌బీఐ దృష్టి

ముంబై: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తన నియంత్రణల పరిధిలో ఉన్న కంపెనీలు వినియోగదారులకు ఆర్థిక ఉత్పత్తులు, సేవలు మోసపూరితంగా విక్రయించడాన్ని నిలువరించే దిశగా సమగ్ర నిబంధనలు జారీ చేయనుంది. ఇందులో భాగంగా ఆయా సంస్థల ప్రకటనలు, మార్కెటింగ్‌, విక్రయాలకు నూతన మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఇలాంటి మోసపూరిత విక్రయాలు అటు కస్టమర్లు, ఇటు ఆర్థిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఆర్‌బీఐ సోమవారం ట్రెండ్‌ అండ్‌ ప్రోగ్రెస్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ ఇన్‌ ఇండియా 2024-25 నివేదికలో తెలిపింది. రికవరీ ఏజెంట్లు, రుణాల రికవరీ విషయాల్లో ప్రవర్తనాపరమైన అంశా లు సమీక్షించి సమన్వయపూర్వకమైన ఆదేశాలు జారీ చేసే విషయం పరిశీలిస్తున్నట్టు తెలిపింది.

Also Read:

Melbourne Pitch: మెల్‌బోర్న్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఏమిచ్చిందంటే..?

Ibomma Ravi: ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. కీలక వివరాలు సేకరించిన పోలీసులు..

Minister Rama Prasad: రాయచోటితో నాకు ప్రత్యేక అనుబంధం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Updated Date - Dec 30 , 2025 | 07:12 AM