RBI Monetary Policy: ఆర్‌బీఐ పాలసీపై అప్రమత్తం
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:39 AM
ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీ సీ) సమావేశం నేపథ్యంలో మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొంది, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు, విదేశీ నిధుల తరలింపు...
ఏడో రోజూ నష్టాల్లో మార్కెట్
ముంబై: ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీ సీ) సమావేశం నేపథ్యంలో మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొంది, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు, విదేశీ నిధుల తరలింపు వరుసగా ఏడో రోజు కూడా మార్కెట్‌ను నష్టాల్లోకి నెట్టాయి. సోమవారం ప్రారంభం నుంచి చివరి వరకు సూచీలు భారీ ఊగిసలాట ధోరణిలో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 61.52 పాయింట్ల నష్టంతో 80,364.94 వద్ద ముగియగా నిప్టీ 19.80 పాయింట్ల నష్టంతో 24,634.90 వద్ద క్లోజయింది. ఏడు వరుస సెషన్లలో సెన్సెక్స్ 2,649.02 పాయింట్లు, నిఫ్టీ 788.7 పాయింట్లు నష్టపోయాయి. అమెరికన్ డాలర్ మారకంలో రూపాయి 3 పైసలు నష్టపోయి 88.75 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.5,687.58 కోట్ల విలువ గల ఈక్విటీలు విక్రయించారు.
ఇవి కూడా చదవండి
ట్రోఫీ తీసుకెళ్లిపోయిన పీసీబీ చీఫ్.. మండిపడ్డ బీసీసీఐ సెక్రెటరీ
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా భారీ ఎస్‌యూవీ..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి