Share News

Raghuram Rajan On Trade: అమెరికాతో చర్చల్లో జాగ్రత్త

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:44 AM

తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బీటీఏ కోసం అమెరికాతో జరుగుతున్న చర్చల్లో.

Raghuram Rajan On Trade: అమెరికాతో చర్చల్లో జాగ్రత్త
Raghuram Rajan On Trade

న్యూఢిల్లీ: తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం అమెరికాతో జరుగుతున్న చర్చల్లో భారత్‌ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ కోరారు. ఈ చర్చల్లో ముఖ్యంగా వ్యవసాయోత్పత్తుల విషయంలో మన ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలన్నారు. లేకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికాతో సహా అన్ని అభివృద్ధి చెందిన దేశాలు తమ రైతులకు పెద్దఎత్తున సబ్సిడీలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ దేశాల నుంచి స్వేచ్చగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను అనుమతిస్తే మన రైతులు రోడ్డున పడే ప్రమాదం ఉందని పరోక్షంగా హెచ్చరించారు. తన వ్యవసాయ, పాల ఉత్పత్తులను కూడా భారత్‌ జీరో డ్యూటీతో అనుమతించాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజన్‌ ఈ హెచ్చరిక చేయడం విశేషం. నేరుగా ఆ దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను స్వేచ్ఛగా అనుమతించే బదులు.. ఆ దేశాల కంపెనీలు, మన వ్యవసాయ రంగానికి తోడ్పడేలా విలువ జోడింపు ఉత్పతుల తయారీ కంపెనీలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని రాజన్‌ సూచించారు.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 04:44 AM