BDL CMD Madhav Rao: ఏ రంగానికైనా ఆర్ అండ్ డీనే దన్ను
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:41 AM
ఏ రంగానికి చెందిన పరిశ్రమల అభివృద్ధికి ఆర్ అండ్ డీ (పరిశోధన, అభివృద్ధి) కీలకమని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సీఎండీ కమోడోర్ ఏ మాధవ రావు...
బీడీఎల్ సీఎండీ మాధవ రావు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఏ రంగానికి చెందిన పరిశ్రమల అభివృద్ధికి ఆర్ అండ్ డీ (పరిశోధన, అభివృద్ధి) కీలకమని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సీఎండీ కమోడోర్ ఏ మాధవ రావు (రిటైర్డ్) అన్నారు. వైమానిక, రక్షణ రంగాలపై భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ చాప్టర్ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రక్షణ, వైమానిక రంగాల్లో ప్రైవేటు కంపెనీల పాత్ర పెరుగుతోందన్నారు. దీంతో గత ఆర్థిక సంవత్సరం మన దేశం నుంచి ఆయుధ ఎగుమతులు రూ.23,000 కోట్లు మించిపోయాయని తెలిపారు. ఇటీవల బీడీఎల్ కూడా ఆర్ అండ్ డీ కార్యకలాపాలను బాగా పెంచిందన్నారు. ప్రస్తుతం తమ టర్నోవర్‌లో దాదాపు 6 శాతం ఇందుకు ఖర్చు చేస్తున్నట్టు మాధవ రావు వెల్లడించారు.
ఇవీ చదవండి:
రూపాయి గాయానికి ఆర్‌బీఐ మందేమిటో..
జనరిక్ సెమాగ్లుటైడ్ తయారీకి డాక్టర్ రెడ్డీస్‌కు గ్రీన్ సిగ్నల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి