Hyderabad Real Estate: రియల్టీ హబ్‌గా పూడూర్
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:20 AM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పూడూర్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఎక్కడ చూసినా పొలాలు, విశాలమైన ఖాళీ స్థలాలతో కనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు స్థిరాస్తి వెంచర్లతో కళకళలాడుతోంది...
మారుతున్న ముఖ చిత్రం
హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పూడూర్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఎక్కడ చూసినా పొలాలు, విశాలమైన ఖాళీ స్థలాలతో కనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు స్థిరాస్తి వెంచర్లతో కళకళలాడుతోంది. హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం టెక్నాలజీ, పరిశోధనా సంస్థలు, తయారీ కంపెనీలతో నగర అభివృద్ధిని మరింత ఎత్తుకు తీసుకుపోతోంది. సమీపంలోని కండ్లకోయలో ఆరు లక్షల చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఐటీ టవర్‌లో దాదాపు 100 టెక్నాలజీ కంపెనీలు కొలువు తీరనున్నాయి.
సమీపంలోనే ఉన్న జినోమ్ వ్యాలీలో ఇప్పటికే నోవార్టిస్, భారత్ బయోటెక్, డ్యూపాంట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ యూనిట్లు ఏర్పాటు చేశాయి. దగ్గరలో ఉన్న దుండిగల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ క్లస్టర్, మేడ్చల్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా పూడూర్ రూపురేఖలను మార్చేస్తున్నాయి. ఓఆర్‌ఆర్ ఆరో ఎగ్జిట్ నుంచి పది నిమిషాల్లో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. మెట్రోరైల్ మూడో దశ విస్తరణ, ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణతో ఈ ప్రాంతానికి మరింత కనెక్టివిటీ ఏర్పడనుంది. దీంతో పూడూర్ సమీప ప్రాంతంలో కాసాగ్రాండ్ వంటి ప్రతిష్ఠాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News