PSBs Large Scale Recruitment: పీఎస్‌బీల్లో కొలువుల జాతర
ABN , Publish Date - Jul 07 , 2025 | 04:02 AM
దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూటు మార్చాయి. పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 50,000 నిమామకాలు చేపట్టనున్నాయి...
ఈ సంవత్సరం 50,000 పోస్టుల భర్తీ
ఒక్క ఎస్‌బీఐలోనే 20 వేల నియామకాలు
న్యూఢిల్లీ: దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూటు మార్చాయి. పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 50,000 నిమామకాలు చేపట్టనున్నాయి. ఇందులో 21,000 ఉద్యోగాలు ఆఫీసర్ పోస్టులు. మిగతా 29,000 క్లరికల్ పోస్టు లు. ఇవే బ్యాంకులు గతంలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందనే పేరుతో 2001లో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) పథకం ద్వారా లక్ష మంది పైగా ఉద్యోగులను ఇంటికి పంపించాయి. అప్పట్లో 26 పీఎ్‌సబీలుంటే విలీనాలతో ఇపుడు వాటి సంఖ్య 12కు తగ్గిపోయింది. అయినా పీఎ్‌సబీలు మళ్లీ పెద్ద ఎత్తున నియామకాలకు దిగడం విశేషం. పెరుగుతున్న వ్యాపారం, శాఖల విస్తరణ, ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఈ నియామకాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఎస్‌బీఐదే పెద్ద వాటా
పీఎ్‌సబీలు ఈ ఆర్థిక సంవత్సరం భర్తీ చేసే 50,000 ఉద్యోగాల్లో ఎస్‌బీఐ వాటానే దాదాపు 20,000 వరకు ఉంది. ఇందులో 505 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) పోస్టులు; 13,455 జూనియర్ అసోసియేట్స్ పోస్టుల ఎంపిక ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ ఏడాది మార్చి నాటికి ఎస్‌బీఐ ఉద్యోగుల సంఖ్య 2,36,226కు చేరింది. ఇందులో అధికారుల సంఖ్య 1,15,066 వరకు ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఒక్కో కొత్త ఉద్యోగి నియామకం కోసం ఎస్‌బీఐ రూ.40,440.59 చొప్పున ఖర్చు చేసింది. ఎస్‌బీఐతో పాటు పీఎన్‌బీ 5,500 మందిని, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,000 మందిని తాజాగా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నాయి.
ఎందుకంటే?
పీఎ్‌సబీలకు ప్రస్తుతం దాదా పు 15 వరకు అనుబంధ లేదా జాయింట్ వెంచర్ కంపెనీలున్నాయి. వీటి కార్యకలాపాలను మరింత విస్తరించి ఐపీఓల ద్వారా వాటిల్లో పెట్టుబడులు కొంతైనా వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల పీఎ్‌సబీలను కోరింది. ఇందుకోసం కూడా పీఎ్‌సబీలు నియామకాలు పెంచుతున్నాయని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు
Read Latest Telangana News and National News