RBI Report: ఈ ఏడాది ప్రైవేట్ పెట్టుబడుల జోరు
ABN , Publish Date - Sep 01 , 2025 | 02:03 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు (క్యాపెక్స్) పుంజుకునే ఆస్కారం కనిపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ పెట్టుబడులు 21.5% వృద్ధితో రూ.2,67,432 కోట్ల స్థాయిలో...
21.5% వృద్థితో రూ.2.67 లక్షల కోట్లు ఉండే చాన్స్: ఆర్‌బీఐ
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు (క్యాపెక్స్) పుంజుకునే ఆస్కారం కనిపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ పెట్టుబడులు 21.5% వృద్ధితో రూ.2,67,432 కోట్ల స్థాయిలో ఉండొచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ పెట్టుబడులు రూ.2,20,132 కోట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ అస్థిరతలు వెన్నాడుతున్నప్పటికీ కార్పొరేట్ సంస్థలు అధిక నగదు నిల్వలు, మెరుగైన లాభదాయకత, విభిన్న రుణ వసతుల అందుబాటుతో 2025-26 ఆర్థిక సంవత్సరంలోకి ఎంతో బలంగా అడుగు పెట్టాయని ‘‘ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు: 2024-25లో వృద్ధి; 2025-26 అంచనాలు’’ పేరిట ఆగస్టు బులెటిన్‌లో ప్రచురించిన వ్యాసంలో ఆర్‌బీఐ తెలిపింది. కార్పొరేట్ రంగం ప్రకటించిన పెట్టుబడి ప్రణాళికలు సమీప భవిష్యత్తులో క్యాపెక్స్ ధోరణులకు అద్దం పడుతున్నట్టు పేర్కొంది.
ముఖ్యాంశాలు..
మౌలిక వసతుల అభివృద్ధికి విధానపరమైన నిరంతర చర్యలు, నిలకడగా అదుపులో ఉన్న ద్రవ్యోల్బణం, తగ్గిన వడ్డీ రేట్లు, తేలిగ్గా నగదు లభ్యత, పెరిగిన సామర్థ్యాల వినియోగం ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలమైన అంశాలు.
ప్రైవేట్ పెట్టుబడుల్లో అధిక భాగం మౌలిక వసతుల రంగం ఆకర్షిస్తుంది. ప్రధానంగా విద్యుత్ రంగం అగ్రస్థానంలో నిలుస్తుంది.
సరికొత్త ప్రాజెక్టులపై పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించడంతో వ్యవస్థలో కాలానుగుణంగా ఏర్పడే రికవరీతో పాటు సామర్థ్యాల నిర్మాణం జరుగుతున్న సంకేతం వెలువడింది. కార్పొరేట్ సంస్థలు తాము ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలను వాస్తవిక పెట్టుబడులుగా మార్చేందుకు ఇది సానుకూల సంకేతం.
భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో పాటు ప్రపంచ దేశాల్లో అస్థిరతలు, మందగించిన డిమాండ్ పెట్టుబడి సెంటిమెంట్‌ను దెబ్బ తీసే ప్రమాదం ఉంది
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి