Share News

Scheme In IPO: రూ. వందల్లో చెలిస్తే.. రూ. లక్షల్లో ప్రయోజనాలు.. జాక్ పాట్

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:47 AM

కరోనా తర్వాత ఇన్యూరెన్స్ పాలసీ తీసుకుంటే.. దానికి జీఎస్టీ సైతం కట్టాల్సి వచ్చేది. కానీ తాజా సంస్కరణ కారణంగా ఇన్యూరెన్స్ పాలసీలపై జీఎస్టీని తీసేశారు. దీంతో హెల్త్ ఇన్యూరెన్స్ పాలసీలు తీసుకునే వారి సంఖ్య మరింత పెరిగింది.

Scheme In IPO: రూ. వందల్లో చెలిస్తే.. రూ. లక్షల్లో ప్రయోజనాలు.. జాక్ పాట్

ఇటీవల కాలంలో అత్యధిక శాతం మంది హెల్త్ ఇన్యూరెన్స్ చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల వరకు దీనిపై జీఎస్టీ సైతం చెల్లించాల్సి వచ్చేది. కానీ కేంద్రం తాజాగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకు వచ్చింది. దీంతో హెల్త్ ఇన్యూరెన్స్‌పై జీఎస్డీని ఎత్తి వేసింది. దాంతో బీమా తీసుకునేందుకు మరింత మంది ముందుకొస్తున్నారు.

ఇంటి యజమానికి అకస్మాతుగా ఏదైనా ప్రమాదం జరిగి.. జరగరానిది జరిగితే.. ఇన్సూరెన్స్ పాలసీలు ఆ ఫ్యామిలీకి అక్కర కొస్తున్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఆ క్రమంలో తక్కువ ప్రీమియంతో ఇండియన్ పోస్టాఫీస్ జీవిత బీమా పాలసీలు తీసుకొచ్చింది. కేవలం వందల్లో ప్రీమియం చెల్లించి.. లక్షల్లో నగదు తీసుకోవచ్చు.


రూ. 755 వార్షిక ప్రీమియంతో రూ. 15 లక్షలు..

పోస్టాఫీస్ ద్వారా రూ. 755 వార్షిక ప్రీమియంతో రూ. 15 లక్షల వరకు ఈ స్కీమ్ కవరేజీని అందిస్తుంది. బీమా తీసుకున్న వ్యక్తి ఒక వేళ ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఆ కుటుంబానికి రూ. 15 లక్షలు చెల్లిస్తారు. ప్రమాదం కారణంగా శాశ్వత అంగవైకల్యం లేదా పూర్తిగా పక్షవాతం వస్తే మొత్తం బీమా చెల్లిస్తారు. ప్రమాదం కారణంగా.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందితే.. అందుకు అయ్యే ఖర్చులకు రూ. లక్ష వరకు చెల్లిస్తారు.

ఆసుపత్రిలో సాధారణ వైద్యానికి రోజుకు రూ. 1000 , ఐసీయూలో చేరితే రోజుకు రూ. 2 వేలు చెల్లిస్తారు. ఇక చేయి లేదా కాలు విరిగితే రూ. 25 వేలు అందజేస్తారు. పాలసీదారు ప్రమాదంలో మరణిస్తే లేకుంటే శాశ్వత వైకల్యానికి గురైతే పిల్లల చదువు కోసం రూ. లక్ష, వివాహం కోసం మరో రూ. లక్ష అదనంగా పోస్టల్ శాఖ చెల్లిస్తుంది.


రూ. 399 వార్షిక ప్రీమియంతో రూ. 10 లక్షల వరకు కవరేజీ..

పోస్టాఫీస్ ద్వారా రూ. 399 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల వరకు ఈ స్కీమ్ కవరేజీని అందించనుంది. బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే.. నామినికి పూర్తిగా బీమా మొత్తం రూ. 10 లక్షలు చెల్లిస్తారు. ప్రమాదం కారణంగా శాశ్వత అంగవైకల్యం లేదా పూర్తిగా పక్షవాతం వస్తే మొత్తం బీమా ర. 10 లక్షలు చెల్లిస్తారు.


ఈ ప్రమాదం కారణంగా.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందితే.. అందుకు అయ్యే ఖర్చులకు రూ. 60 వేల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరకుండా కేవలం ఔట్ పేషెంట్ విభాగంలో చికిత్స పొందితే రూ. 30 వేల వరకు కవరేజ్ లభిస్తుంది. ప్రమాదంలో పాలసీదారు మరణిస్తే లేదా శాశ్వత వైకల్యానికి గురైతే.. గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువు కోసం రూ. లక్ష వరకు లేదా పాలసీలో పేర్కొన్న శాతం మొత్తాన్ని చెల్లిస్తారు.


ఆసుపత్రిలో చేరితే ప్రతి రోజు రూ. 1000 చొప్పున గరిష్టంగా 10 రోజుల వరకు చెల్లిస్తారు. ప్రమాదంలో మరణిస్తే.. అంత్యక్రియల ఖర్చుల కోసం రూ. 5 వేలు వరకు నామినీకి చెల్లిస్తారు. ఇక ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లడానికి అయ్యే రవాణా ఖర్చులకుగాను రూ. 25 వేల వరకు చెల్లించే అవకాశం ఉంది. అయితే ఈ పథకం పొందడానికి ఇండియా పోస్ట్ పేమేంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)లో ఖాతా తప్పనిసరిగా ఉండాల్సి ఉంది. ఈ పాలసీని ప్రతి ఏడాది రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు సైతం ఉంది.

Updated Date - Oct 14 , 2025 | 11:50 AM