PNB and BOM Cut Lending Rates: వడ్డీ రేట్లను తగ్గించిన పీఎన్‌బీ బీఓఎమ్
ABN , Publish Date - Dec 08 , 2025 | 02:51 AM
ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎమ్) కూడా తమ రుణరేట్లను...
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎమ్) కూడా తమ రుణరేట్లను పావు శాతం తగ్గించాయి. సవరించిన వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని బ్యాంకులు వెల్లడించాయి. పీఎన్‌బీ రెపో అనుసంధానిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) 8.35 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గింది. నిఽధల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎమ్‌సీఎల్‌ఆర్), బేస్ రేటులో మాత్రం ఎటువంటి మార్పు చేయలేదని పీఎన్‌బీ స్పష్టం చేసింది. తాజా సవరణతో తమ బ్యాంకులో గృహ రుణంపై వడ్డీ 7.10 శాతం, కార్ లోన్ రేటు 7.45 శాతం నుంచి ప్రారంభమవుతాయని బీఓఎమ్ తెలిపింది.
ఇవీ చదవండి:
ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన
భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి