PhonePe IPO: ఫోన్‌పే రూ 12000 కోట్ల ఐపీఓ
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:17 AM
ప్రపంచ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ గ్రూప్ అనుబంధ సంస్థ ఫోన్‌పే కూడా తొలి పబ్లిక్ ఆఫరింగ్‌కు (ఐపీఓ) రాబోతోంది. ఇందుకు అనుమతి కోరుతూ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ప్రాథమిక ముసాయిదా...
సెబీకి ముసాయిదా పత్రాలు
న్యూఢిల్లీ: ప్రపంచ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ గ్రూప్ అనుబంధ సంస్థ ఫోన్‌పే కూడా తొలి పబ్లిక్ ఆఫరింగ్‌కు (ఐపీఓ) రాబోతోంది. ఇందుకు అనుమతి కోరుతూ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓ వివరాలను గోప్యంగా ఉంచేందుకు ఈ సంస్థ కాన్ఫిడెన్షియల్ ప్రీ-ఫైలింగ్ మార్గాన్ని ఎంచుకుంది. ఐపీఓ ద్వారా ఫోన్‌పే రూ.12,000 కోట్ల వరకు నిధులు సమీకరించాలనుకుంటున్నదని, ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) పద్ధతిన జరగనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఓఎ్‌ఫఎస్ ద్వారా కంపెనీ వాటాదారులైన వాల్‌మార్ట్, టైగర్ గ్లోబల్, మైక్రోసాఫ్ట్ మొత్తంగా 10 శాతం వరకు వాటాను విక్రయించనున్నాయని వారన్నారు. 2016 ఆగస్టులో ప్రారంభమైన ఫోన్‌పే డిజిటల్ చెల్లింపులతోపాటు బీమా, రుణాలు, వెల్త్ సేవలనూ అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ వాటాపరంగా ఫోన్‌పే దేశంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల సేవల కంపెనీగా ఉంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి