Uniform GST Pharma: ఫార్మాపై ఒకే జీఎస్‌టీ ఉండాలి ఫార్మెక్సిల్
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:42 AM
ప్రతిపాదిత జీఎ్‌సటీ సవరణలో ఔషధాలు, వాటి ముడి పదార్ధాలపై ఒకే పన్ను రేటు ఉండాలని ఫార్మా పరిశ్రమ కోరుతోంది. ప్రస్తుతం తుది ఔషధాల (ఫార్ములేషన్లు)పై 12 శాతం, వాటి తయారీకి ఉపయోగించే ప్రధాన ముడి పదార్ధం...
న్యూఢిల్లీ: ప్రతిపాదిత జీఎ్‌సటీ సవరణలో ఔషధాలు, వాటి ముడి పదార్ధాలపై ఒకే పన్ను రేటు ఉండాలని ఫార్మా పరిశ్రమ కోరుతోంది. ప్రస్తుతం తుది ఔషధాల (ఫార్ములేషన్లు)పై 12 శాతం, వాటి తయారీకి ఉపయోగించే ప్రధాన ముడి పదార్ధం ఏపీఐలపై 18 శాతం జీఎ్‌సటీ వసూలు చేస్తున్నారు. ప్రతిపాదిత సవరణలో ఈ వ్యత్యాసాన్ని సవరించి రెంటిపైనా ఒకే జీఎ్‌సటీ రేటు విధించాలని భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) వైస్ చైర్మన్ భవిన్ మెహతా కోరారు. ఔషధాలపై ప్రస్తుతం ఉన్న జీఎ్‌సటీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి, ఏపీఐలపై అదే స్థాయిలో 18 శాతం సుంకాలు విధించినా పరిశ్రమకు మంచిది కాదన్నారు.
Also Read:
గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..
కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..
For More Telangana News and Telugu News..