ValueLabs Investment: వాల్యూల్యాబ్స్‌పై పీఈ సంస్థల కన్ను
ABN , Publish Date - Nov 19 , 2025 | 06:04 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ కంపెనీ వాల్యూలాబ్స్ ఈక్విటీలో మెజారిటీ వాటా చేజిక్కించుకునేందుకు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈక్యూటీ...
రేసులో ఈక్యూటీ, పీఏజీ, బ్లాక్‌స్టోన్, సీవీసీ సంస్థలు
మెజారిటీ వాటా కోసం చర్చలు
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ కంపెనీ వాల్యూలాబ్స్ ఈక్విటీలో మెజారిటీ వాటా చేజిక్కించుకునేందుకు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈక్యూటీ, పీఏజీ, సీవీసీ సహా బ్లాక్‌స్టోన్ వంటి పీఈ సంస్థలు.. వాల్యూల్యాబ్స్‌లో మెజారిటీ వాటా కోసం సంస్థను ప్రమోట్ చేసిన దొనకంటి కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కంపెనీ విలువ రూ.8,800 కోట్లు (100 కోట్ల డాలర్లు)గా లెక్కకట్టినట్లు తెలుస్తోంది. డీల్ విషయంలో అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్.. వాల్యూల్యాబ్స్ ప్రమోటర్లకు సహకరిస్తున్నట్లు సమాచారం. పీఈ సంస్థలతో చర్చలు పూర్తయితే ఈ నెలాఖరులోనే తొలి దశ బిడ్స్‌ను ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. వాల్యూల్యాబ్స్ వాల్యుయేషన్‌పై స్పష్టత వస్తే మరికొన్ని పీఈ సంస్థలు, వ్యూహాత్మక ఇన్వెస్టర్లు కూడా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
1997లో ప్రారంభం
వాల్యూలాబ్స్ సంస్థను 1997లో దొనకంటి అర్జున రావు, ఆయన కుటుంబసభ్యులు ప్రమోట్ చేశారు. ఈ మధ్య స్థాయి ఐటీ కంపెనీ 300కు పైగా కంపెనీలకు ఏఐ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ అందిస్తోంది. ప్రస్తుతం వాల్యూలాబ్స్‌లో 7,000 మందికిపైగా ఇంజనీర్లు పని చేస్తున్నారు. ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్, క్వాలిటీ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అండ్ అనలిటిక్స్‌లో కంపెనీకి మంచి పట్టుంది. దీంతో పీఈ సంస్థలు వాల్యూల్యాబ్స్ ఈక్విటీలో మెజారిటీ వాటా తీసుకునేందుకు ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Read Latest AP News And Telugu News