Auto Sales in August 2025: ఆగస్టులో ఆటోకు నిరాశ
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:13 AM
ఆగస్టు నెలలో ప్యాసింజర్ వాహన కంపెనీల టోకు విక్రయాలు తగ్గాయి. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీతోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ అమ్మకాల్లో క్షీణత నమోదైంది. ఈ నెలలో...
న్యూఢిల్లీ: ఆగస్టు నెలలో ప్యాసింజర్ వాహన కంపెనీల టోకు విక్రయాలు తగ్గాయి. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీతోపాటు మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ అమ్మకాల్లో క్షీణత నమోదైంది. ఈ నెలలో వాహనాలపై జీఎ్‌సటీ రేట్లు గణనీయంగా తగ్గవచ్చన్న ఆశలతో కస్టమర్లు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం ఇందుకు ప్రధాన కారణమైంది. మారుతి సుజుకీ దేశీయ టోకు విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 8 శాతం తగ్గగా.. హ్యుండయ్ మోటార్స్ నుంచి డీలర్లకు సరఫరాలు 11 శాతం తగ్గాయి. మహీంద్రా సేల్స్ 9 శాతం, టాటా మోటార్స్ అమ్మకాలు 7 శాతం క్షీణించాయి. టయోటా విక్రయాలు మాత్రం 2 శాతం పెరిగాయి. ద్విచక్ర వాహనాల విభాగంలో బజాజ్ ఆటో దేశీయ టోకు విక్రయాలు 12 శాతం తగ్గగా.. టీవీఎస్ మోటార్ సేల్స్ 28 శాతం పెరిగాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 57 శాతం పుంజుకున్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి