Oracle Layoffs India: ఒరాకిల్ నుంచి 100 మందికి పైగా ఔట్
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:41 AM
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడే ఒరాకిల్‌లోనూ ఈ కోతల పర్వం ప్రారంభమైంది. కంపెనీ భారత్‌లోని తన యూనిట్ల నుంచి వంద మందికి పైగా ఉద్యోగులను ఇంటికి...
న్యూఢిల్లీ: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడే ఒరాకిల్‌లోనూ ఈ కోతల పర్వం ప్రారంభమైంది. కంపెనీ భారత్‌లోని తన యూనిట్ల నుంచి వంద మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించినట్టు సమాచారం. ఏఐ ప్రభావంతో పాటు ఖర్చులు తగ్గించుకోవాలన్న వ్యూహం ఇందుకు ప్రధాన కారణమని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. తొలగించిన ఉద్యోగులకు వారు కంపెనీలో పని చేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతంతో పాటు ఏడాది పాటు ఇన్సూరెన్స్ కవరేజీ కల్పించినట్టు సమాచారం. ఒరాకిల్ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000 మందిని ఇంటికి పంపించింది. భారత్‌లోని ఒరాకిల్ యూనిట్లలో దాదాపు 30,000 మంది పని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి