ONGC Investment: కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీ రూ 4600 కోట్ల పెట్టుబడి
ABN , Publish Date - Aug 12 , 2025 | 03:19 AM
ప్రభుత్వ రంగంలోని చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్‌జీసీ) కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై రూ.4,600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 10 బావులు తవ్వడంతో పాటు రెండు అన్‌మ్యాన్డ్ ప్లాట్‌ఫారాలు...
10 బావుల అభివృద్ధి, ఆఫ్‌షోర్ పైప్‌లైన్ ఏర్పాటు
హైదరాబాద్: ప్రభుత్వ రంగంలోని చమురు, సహజ వాయువుల సంస్థ (ఓఎన్‌జీసీ) కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై రూ.4,600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 10 బావులు తవ్వడంతో పాటు రెండు అన్‌మ్యాన్డ్ ప్లాట్‌ఫారాలు, ఒక ఆఫ్‌షోర్ పైప్‌లైన్ ఏర్పాటు చేయనుంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో ఒక ఆన్‌షోర్ గ్యాస్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టులకు తాజాగా పర్యావరణపరమైన అనుమతులివ్వాలని పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖను ఓఎన్‌జీసీ కోరింది. ఈ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పని చేస్తున్న నిపుణుల అప్రైజల్ కమిటీ (ఈఏసీ) జూలై 24వ తేదీన నిర్వహించిన సమావేశం తీర్మానాల్లో ఈ అంశాలున్నాయి. తూర్పు కోస్తాలో 697 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల కేజీ/ఓఎ్‌సడీఎ్‌సఎ్‌ఫ/చంద్రిక/2021 (చంద్రిక), 148 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల కేజీ/ఓఎ్‌సడీఎ్‌సఎ్‌ఫ/జీఎస్49/2021 ఆఫ్‌షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ కాంట్రాక్ట్ ప్రాంతాలకు 2022 సెప్టెంబరులో డీఎ్‌సఎఫ్-3 (కనుగొన్న చిన్న క్షేత్రం-3) కింద డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్‌ఓఏ) జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు 26.3 హెక్టార్ల (ఓడల రేవు టెర్మినల్) భూమి అవసరమవుతుందని, అందులో 8.7 హెక్టార్లలో (మొత్తం ప్రాజెక్టు ప్రదేశంలో 33ు) హరిత ప్రాంతాలను అభివృద్ధి చేస్తారని ఈఏసీ తెలిపింది. పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) పెట్టుబడి వ్యయం రూ.14 కోట్లు కాగా దీనిపై ఏడాదికి రూ.3 కోట్ల ఈఎంపీ వ్యయం కూడా భరించాల్సి ఉంటుంది. వాణిజ్యపరంగా లాభదాయకమైన నిల్వలున్నట్టు నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఈ బావులు తవ్వారు. ఈ ప్రాజెక్టు ద్వారా 150 మందికి ప్రత్యక్ష ఉపాధి, 310 మందికి పరోక్ష ఉపాధి లభించనుంది.
ఇవీ చదవండి:
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్
పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం