Share News

NTPC Dividend 2024 25: ఎన్‌టీపీసీ రూ 3248 కోట్ల తుది డివిడెండ్‌

ABN , Publish Date - Sep 28 , 2025 | 06:06 AM

ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్‌టీపీసీ.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.3,248 కోట్ల తుది డివిడెండ్‌ను ....

NTPC Dividend 2024 25: ఎన్‌టీపీసీ రూ 3248 కోట్ల తుది డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్‌టీపీసీ.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.3,248 కోట్ల తుది డివిడెండ్‌ను అందించింది. ఎన్‌టీసీపీ సీఎండీ గురుదీప్‌ సింగ్‌.. విద్యుత్‌ శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌కు ఈ డివిడెండ్‌ చెక్‌ను అందజేశారు. కాగా గత ఏడాది నవంబరులో రూ.2,424 కోట్లు, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో రూ.2,424 కోట్ల మధ్యంతర డివిడెండ్స్‌ను అందించింది. దీంతో గడచిన ఆర్థిక సంవత్సరంలో ఎన్‌టీపీసీ మొత్తం రూ.8,096 కోట్ల డివిడెండ్‌ను చెల్లించినట్లయింది.

ఇవీ చదవండి:

Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి

Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2025 | 06:06 AM