NSE Investor Statistics: మార్కెట్ మదుపరుల్లో 25 శాతం మహిళలే
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:44 AM
దేశంలో అతిపెద్ద ఈక్విటీ ట్రేడింగ్ వేదికైన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) ఇన్వెస్టర్లు ఈ నెల 23 నాటికి 12 కోట్లు దాటారు. గత 8 నెలల్లో ఇన్వెస్టర్ల సంఖ్య మరో కోటి...
12 కోట్లు దాటిన ఎన్‌ఎ్‌సఈ ఇన్వెస్టర్ బేస్
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఈక్విటీ ట్రేడింగ్ వేదికైన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) ఇన్వెస్టర్లు ఈ నెల 23 నాటికి 12 కోట్లు దాటారు. గత 8 నెలల్లో ఇన్వెస్టర్ల సంఖ్య మరో కోటి (11 కోట్ల నుంచి 12 కోట్లకు) పెరిగిందని ఎన్‌ఎ్‌సఈ గురువారం వెల్లడించింది. మొత్తం ఇన్వెస్టర్లలో 25 శాతం (ప్రతి నలుగురిలో ఒకరు) మహిళలేనని తెలిపింది.
14 ఏళ్లకు తొలి కోటి..
ఈ ఏడాది జనవరిలో ఎన్‌ఎ్‌సఈ వినూత్న ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్లు దాటింది. ఎక్స్ఛేంజీ కార్యకలపాలు ప్రారంభించిన 14 ఏళ్లకు తొలి కోటి ఇన్వెస్టర్ల మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత ఏడేళ్లకు రెండు కోట్లకు చేరింది. ఆపై 3.5 ఏళ్లలో మూడు కోట్లు దాటింది. ఆ తర్వాత ఏడాదికి పైగా కాలంలో (2021 మార్చి నాటికి) 4 కోట్లకు ఎగబాకింది. అంటే, 4 కోట్ల ఇన్వెస్టర్లను సాధించేందుకు ఎక్స్ఛేంజీకి పాతికేళ్లకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత ప్రతి 6-7 నెలలకు ఇన్వెస్టర్లు కోటి మేర పెరుగుతూ వచ్చారు.
23.5 కోట్లు: ఈ నెల 23 నాటికి ఎన్‌ఎన్‌ఈలో నమోదైన మొత్తం ఇన్వెస్టర్ అకౌంట్ల సంఖ్య
33 ఏళ్లు: ఎక్స్ఛేంజీలోని 12 కోట్లకు పైగా వినూత్న ఇన్వెస్టర్ల సగటు వయసు. దాదాపు 40 శాతం మంది 30 ఏళ్లలోపు వారే.
99.85 శాతం: ఎన్‌ఎ్‌సఈ ఇన్వెస్టర్లు దేశంలోని 99.85 శాతం పిన్ కోడ్‌లలో విస్తరించి ఉన్నారు.
మహారాష్ట్ర టాప్: రాష్ట్రాల వారీగా చూస్తే, 1.9 కోట్ల ఇన్వెస్టర్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్ (1.4 కోట్లు), గుజరాత్ (1.03 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
25,000 దిగువకు నిఫ్టీ
సెన్సెక్స్ 556 పాయింట్లు డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టపోయాయి. సెన్సెక్స్ 555.95 పాయింట్లు కోల్పోయి 81,159.68 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 166.05 పాయింట్లు పతనమై 25,000 దిగువ స్థాయి 24,890.85 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.21 లక్షల కోట్ల మేర తరిగిపోయి రూ.457.35 లక్షల కోట్లకు పడిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ, హెచ్1బీ వీసా ఫీజు పెంపు ఆందోళనలు, అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు ఇందుకు ప్రధాన కారణం. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 25 నష్టపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News