Nifty Under Pressure: టెక్ వ్యూ 24600 దిగువన మరింత బలహీనం
ABN , Publish Date - Sep 29 , 2025 | 01:42 AM
నిఫ్టీ గత వారం మొత్తం ఐదు రోజులూ ఎడతెరిపి లేని డౌన్‌ట్రెండ్‌లో ట్రేడయి 670 పాయింట్ల నష్టంతో గత శుక్రవారం 24,650 వద్ద ముగిసింది. ర్యాలీ అనంతరం మూడు వారాలుగా బలమైన కరెక్షన్‌లో ట్రేడవుతుండడం...
నిఫ్టీ గత వారం మొత్తం ఐదు రోజులూ ఎడతెరిపి లేని డౌన్‌ట్రెండ్‌లో ట్రేడయి 670 పాయింట్ల నష్టంతో గత శుక్రవారం 24,650 వద్ద ముగిసింది. ర్యాలీ అనంతరం మూడు వారాలుగా బలమైన కరెక్షన్‌లో ట్రేడవుతుండడం మరింత అప్రమత్త సంకేతం. గత వారం ఊహించిన దాని కన్నా ఎక్కువ కరెక్షన్ సాధిండమే కాకుండా కీలక స్థాయి 25,000 కన్నా దిగజారింది. భారీ అమ్మకాల ఒత్తిడి కారణంగా మిడ్‌క్యాప్-100 సూచీ 2,700 పాయింట్లు, స్మాల్‌క్యాప్-100 సూచీ 940 పాయింట్ల మేరకు నష్టపోయాయి. మార్కెట్లో ప్రధాన ట్రెండ్ బలహీనంగానే ఉంది. గత వారం నిట్టనిలువుగా పతనమైనందు వల్ల టెక్నికల్ రికవరీకి ఆస్కారం ఉంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం ముందుగా మార్కెట్ స్థిరపడాలి. కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది.
బుల్లిష్ స్థాయిలు: మైనర్ రికవరీ బాట పట్టినట్టయితే భద్రత కోసం మైనర్ నిరోధం 24,800 వద్ద నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 25,000. ఇదే స్వల్పకాలిక నిరోధం కావడం వల్ల ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి.
బేరిష్ స్థాయిలు: మైనర్ మద్దతు స్థాయి 24,600 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలం కావడం మరింత బలహీనత సంకేతం. ప్రధాన మద్దతు స్థాయి 24,300. ఇక్కడ కూడా విఫలమైతే మరింత బలహీనత ప్రదర్శిస్తుంది. ప్రధాన స్వల్పకాలిక మద్దతు స్థాయి 24,000.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ కూడా గత వారంలో డౌన్‌ట్రెండ్‌లో ట్రేడయి ఈ నెలకు కనిష్ఠ స్థాయి 54,400 వద్ద ముగిసింది. ప్రధాన నిరోధ స్థాయి 55,000. ప్రధాన మద్దతు స్థాయి 54,000. భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది. అప్రమత్తత తప్పదు.
పాటర్న్: మార్కెట్ దీర్ఘకాలిక సైడ్‌వేస్ ట్రెండ్‌లో ఉంది. గత కొద్ది నెలలుగా స్వల్పకాలిక ఎగుడు దిగుడులు, డౌన్‌ట్రెండ్ పాటర్న్‌లు ఏర్పడ్డాయి. సానుకూలత కోసం 25,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 25,800, 24,860
మద్దతు : 24,600, 24,520
వి. సుందర్ రాజా
ఇవీ చదవండి:
Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి
Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి