Nifty Technical View: 26,000 వద్ద నిరోధం
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:16 AM
గత వారం ఆరంభంలో నిఫ్టీ 25,000 దిగువకు చేరి ఆ తర్వాత బౌన్స్‌బ్యాక్ అయ్యింది. చివరి మూడు సెషన్లలో ర్యాలీని కనబరుస్తూ 424 పాయింట్ల లాభంతో 25,700 స్థాయిల్లో క్లోజైంది. నిఫ్టీ గత మూడు వారాలుగా...
గత వారం ఆరంభంలో నిఫ్టీ 25,000 దిగువకు చేరి ఆ తర్వాత బౌన్స్‌బ్యాక్ అయ్యింది. చివరి మూడు సెషన్లలో ర్యాలీని కనబరుస్తూ 424 పాయింట్ల లాభంతో 25,700 స్థాయిల్లో క్లోజైంది. నిఫ్టీ గత మూడు వారాలుగా 1,100 పాయింట్ల మేర లాభపడి ప్రస్తుతం ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలైన 26,000కు చేరువలో ఉంది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటం మంచిది. టెక్నికల్‌గా చూస్తే కీలక నిరోధ స్థాయిలైన 26,000 ఎగువన నిలదొక్కుకుంటేనే తదుపరి అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుందా లేదా అనేది తేలుతుంది. మిడ్‌క్యాప్-100 సూచీ వీక్లీ ప్రాతిపదికన 205 పాయింట్లు లాభపడింది. గరిష్ఠ స్థాయిల వద్ద అప్రమత్త ట్రెండ్‌ను సూచిస్తోంది. స్మాల్‌క్యాప్-100 ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసి ఎలాంటి మూమెంట్‌ను సూచించటం లేదు.
బుల్లిష్ స్థాయిలు: సానుకూల ట్రెండ్ కోసం 26,000 ఎగువన నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఇది గత ఏడాది సెప్టెంబరులో ఏర్పడిన స్థాయి. ఇక్కడి నుంచే మార్కెట్ బలమైన కరెక్షన్‌లోకి జారుకుంది. ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. అప్‌ట్రెండ్ ను కనబరచాలంటే మాత్రం ఈ స్థాయిలకు ఎగువన బలంగా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 26,300.
బేరిష్ స్థాయిలు: ఒకవేళ నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తే 25,500 దిగువన తదుపరి మద్దతు స్థాయిలుంటాయి. రక్షణ కోసం ఈ స్థాయిలకు ఎగువన పటిష్ఠంగా క్లోజ్ కావాల్సి ఉంటుంది. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 25,000.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం 1,100 పాయింట్ల మేరకు ర్యాలీ సాధించిన ఈ సూచీ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలైన 57,710 వద్ద ముగిసింది. టెక్నికల్‌గా పుల్‌బ్యాక్ రియాక్షన్‌కు అవకాశం ఉండటంతో అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 58,000. ఇక్కడ కొద్ది రోజులు నిలదొక్కుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ఒకవేళ కరెక్షన్‌ను కనబరిస్తే సానుకూల ట్రెండ్ కోసం 57,500 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి. ఇక్కడ కూడా నిలదొక్కుకోకపోతే తదుపరి మద్దతు స్థాయి 57,000 వద్ద ఉంటుంది.
పాటర్న్: పాజిటివ్ ట్రెండ్ కోసం 25,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిలదొక్కుకోవాలి. ప్రస్తుతం మార్కెట్ స్వల్పకాలిక ఓవర్‌బాట్ పొజిషన్‌కు చేరువలో ఉంది. గరిష్ఠ స్థాయిల వద్ద స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 25,910, 26,000
మద్దతు : 25,780, 25,700
వి. సుందర్ రాజా
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
Read Latest AP News And Telugu News