Technical Analysis Nifty: టెక్ వ్యూ 25,000 వద్ద పరీక్ష
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:33 AM
నిఫ్టీ గత వారం మానసిక అవధి 25,000 వరకు వెళ్లినా అక్కడ నిలదొక్కుకోలేకపోయింది. శుక్రవారంనాడు ఏర్పడిన బలమైన రియాక్షన్‌తో ఆ స్థాయి కన్నా దిగజారింది. వారం మొత్తానికి 240 పాయింట్ల లాభంతో 24,870 వద్ద వారం కనిష్ఠ స్థాయికి...
నిఫ్టీ గత వారం మానసిక అవధి 25,000 వరకు వెళ్లినా అక్కడ నిలదొక్కుకోలేకపోయింది. శుక్రవారంనాడు ఏర్పడిన బలమైన రియాక్షన్‌తో ఆ స్థాయి కన్నా దిగజారింది. వారం మొత్తానికి 240 పాయింట్ల లాభంతో 24,870 వద్ద వారం కనిష్ఠ స్థాయికి చేరువలో ముగిసింది. గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తతకు ఇది సంకేతం. మార్కెట్లో ప్రధాన ట్రెండ్ ఇప్పటికీ పాజిటివ్‌గానే ఉంది. అయితే మిడ్‌క్యాప్-100 సూచీ 1125 పాయింట్లు లాభపడి 57,630 వద్ద స్మాల్‌క్యాప్-100 సూచీ 370 పాయింట్ల లాభంతో 17,920 వద్ద ముగిశాయి. ట్రెండ్‌లో సానుకూలత కోసం తదుపరి నిరోధాల వద్ద బలంగా నిలదొక్కుకోవాల్సి ఉంది. అమెరికన్ మార్కెట్లో గత శుక్రవారం నాటి ర్యాలీ కారణంగా ఈ వారం మన మార్కెట్ పాజిటివ్‌గానే ప్రారంభం కావచ్చు.
బుల్లిష్ స్థాయిలు: గరిష్ఠ స్థాయిల్లో మరింత కన్సాలిడేషన్ ఉండవచ్చు. మార్కెట్ ఈ వారంలో స్వల్పకాలిక నిరోధం, మానసిక అవధి 25,000 వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు. మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమించాలంటే ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. ఆ పైన ప్రధాన నిరోధం 25,250.
బేరిష్ స్థాయిలు: 25,000 వద్ద విఫలమైతే మరింత బలహీనపడవచ్చు. ప్రధాన మద్దతు స్థాయి 24,850. ఇక్కడ కూడా విఫలమైతే మరింత బలహీనపడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 24,500.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారంలో 56,000 స్థాయిని బ్రేక్ చేసినా శుక్రవారం నాటి బలమైన రియాక్షన్ కారణంగా వారం మొత్తానికి 190 పాయింట్ల నష్టంతో 55,150 వద్ద ముగిసింది. ప్రధాన మద్దతు స్థాయి 55,000 కన్నా పైనే ఉంది. తదుపరి నిరోధం 55,700 కన్నా పైన నిలదొక్కుకుంటే పాజిటివ్ సంకేతం ఇస్తుంది. తదుపరి ప్రధాన నిరోధం 56,200.
పాటర్న్: నిఫ్టీ ఇప్పుడు 25,000 సమీపంలో ఉన్న 50 డిఎంఏ వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. అదే స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద కూడా నిలదొక్కుకోవడం తప్పనిసరి.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళ, శుక్రవారాల్లో మైనర్ రివర్సల్స్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 25,000, 25,060
మద్దతు : 24,940, 24,850
వి. సుందర్ రాజా
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News