Nifty Faces Consolidation: టెక్ వ్యూ 26,000 వద్ద అప్రమత్తం
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:15 AM
గత వారం నిఫ్టీ అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ ప్రారంభమై కీలక నిరోధం 26,000 కూడా దాటింది. కాని ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. గత ఏడాది సెప్టెంబరులో ఏర్పడిన గరిష్ఠ స్థాయి 26,100 సమీపంలో రియాక్షన్‌కు....
గత వారం నిఫ్టీ అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ ప్రారంభమై కీలక నిరోధం 26,000 కూడా దాటింది. కాని ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. గత ఏడాది సెప్టెంబరులో ఏర్పడిన గరిష్ఠ స్థాయి 26,100 సమీపంలో రియాక్షన్‌కు గురి కావడం అప్రమత్త సంకేతం. అయితే ముందు వారంతో పోల్చితే మాత్రం 85 పాయింట్ల స్వల్ప లాభంతో 25,800 సమీపంలో క్లోజైంది. నాలుగు వారాల నిరంతర ర్యాలీలో 1,600 పాయింట్ల మేరకు లాభపడిన అనంతరం గరిష్ఠ స్థాయిల్లో ఆకస్మికంగా ఏర్పడిన రియాక్షన్ ఇది. కీలక నిరోధ స్థాయిలో ఏర్పడిన ఈ రియాక్షన్ కారణంగా ఈ వారంలో మరింత అప్రమత్త లేదా కన్సాలిడేషన్ ట్రెండ్‌కు ఆస్కారం ఉంది.
బుల్లిష్ స్థాయిలు: ప్రస్తుత గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేషన్ ఉండవచ్చు. పాజిటివ్ ట్రెండ్‌లో పురోగమించినట్టయితే మరింత అప్‌ట్రెండ్ కోసం తదుపరి నిరోధం 26,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం, జీవితకాల గరిష్ఠ స్థాయి 26,300.
బేరిష్ స్థాయిలు: మరింత రియాక్షన్‌కు గురైనా భద్రత కోసం మద్దతు స్థాయి 25,500 వద్ద నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 25,000.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ ఫ్లాట్‌గా ట్రేడయి 57,700 వద్ద క్లోజయింది. ముందు వారం జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకిన అనంతరం ఏర్పడిన పుల్‌బ్యాక్ రియాక్షన్ ఇది. మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమించాలంటే ప్రధాన నిరోధం 58,200 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 59,000. రియాక్షన్‌లో పడినా భద్రత కోసం మద్దతు స్థాయి 57,000 వద్ద నిలదొక్కుకోవాలి. విఫలమైతే మరింత బలహీనత తప్పదు.
పాటర్న్: సానుకూలత కోసం 25,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిలదొక్కుకోవాలి. స్వల్పకాలిక ఓవర్‌బాట్ స్థితిలో ప్రవేశించిన తర్వాత రియాక్షన్ ఏర్పడినందు వల్ల గరిష్ఠ స్థాయిల్లో స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
టైమ్ : ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 25,920, 26,000
మద్దతు : 25,700, 25,620
వి. సుందర్ రాజా
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News