Share News

‘టెంప్లెట్‌ మోడల్‌’లో కొత్త విమానాశ్రయాలు

ABN , Publish Date - Mar 12 , 2025 | 02:22 AM

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న విమాన ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు మరిన్ని విమానాశ్రయాలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా....

‘టెంప్లెట్‌ మోడల్‌’లో కొత్త విమానాశ్రయాలు

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న విమాన ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు మరిన్ని విమానాశ్రయాలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి తెచ్చేందుకు ‘‘టెంప్లెట్‌ మోడల్‌’’ అనుసరించాలనుకుంటున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్‌ నాయుడు చెప్పారు. టెంప్లెట్‌ మోడల్‌లో ప్రయాణికులు, సరుకు రవాణా, విమానయాన శిక్షణ సంస్థలు సహా విభిన్న అవసరాలకు వేర్వేరు విమానాశ్రయాలుంటాయి. దీని వల్ల ప్రయాణికులు రాకపోకలు సాగించే విమానాశ్రయాలపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటైన మన దేశంలో ప్రస్తుతం 159 విమానాశ్రయాలున్నాయి. 200 శిక్షణ విమానాల సరఫరాకు ఎంఓయూపై సంతకాలు చేసే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ విమానయాన సంస్థలు ఇప్పటికే 1,700 విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయని చెప్పారు. దీన్ని బట్టి రాబోయే 15-20 సంవత్సరాల కాలంలో మన దేశానికి 30 వేల మంది పైలట్లు అవసరమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో పైలట్లున్నారని ఆయన చెప్పారు.


150 శిక్షణ విమానాలు తయారుచేయనున్న ‘శక్తి’: దేశీయంగా విమానాల తయారీకి ఉత్తేజం కల్పిస్తూ శక్తి ఎయిర్‌క్రాఫ్ట్‌ పరిశ్రమ 150 శిక్షణ విమానాలను నిర్మించనుంది. తమిళనాడుకు చెందిన శక్తి గ్రూప్‌, ఆస్ర్టియాకు చెందిన డైమండ్‌ ఎయిర్‌క్రా్‌ఫ్టల మధ్య జాయింట్‌ వెంచర్‌ ఇది.

Read Also : 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన..

Business Ideas: మీ దగ్గర రూ.1000 లు ఉంటే చాలు.. ఈ వ్యాపారంలో నెలకు మినిమం రూ.30 వేల ప్రాఫిట్..

Airtel - Space X Deal: ఎయిర్ టెల్ సాయంతో స్టార్‌లింక్ భారత్‌లోకి ఎంట్రీ.. స్పేస్ ఎక్స్‌‌

Updated Date - Mar 12 , 2025 | 02:22 AM